చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల నాటికి ఎలాగైనా బలపడాలని తెగ పోరాటం చేస్తున్నాడు.. గత ఎన్నికల్లో కనపడని ఉత్సాహం ఎదో ఇప్పుడు తెగ కనిపిస్తుంది.. అనవసర విమర్శలు చేస్తూ జగన్ ని ఆడిపోసుకుంటూ అయన తెచ్చిన పథకాలను విమర్శిస్తూ వైసీపీ నాయకులను నీరుగార్చేస్తు చంద్రబాబు చేసే వ్యాఖ్యలకు ఎవరు ఏమాత్రం చలించట్లేదు.. వైసీపీ నాయకులూ జగన్ చెప్పిన విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా చేస్తూ ప్రజలకు సహకరిస్తున్నారు.. చంద్రబాబు మాత్రం ఎక్కడ జగన్ దెబ్బ కొట్టాల అన్నట్లు చూస్తున్నారు.. సందు దొరికితే బ్యాడ్ చేసి తాను పీఠమెక్కాలని ప్రయత్నిస్తున్నారు..

అయితే చంద్రబాబు రాజకీయ చాణక్యుడు అని చెప్పాలి.. ఓ వైపు జగన్ ని బ్యాడ్ చేస్తూనే ప్రజల్లో తన తిరిగి నమ్మకం సంపాదించుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఆంధ్ర లో పేరు సంపాదించుకుంటున్న బీజేపీ పై కన్నేశాడు.. అవసరం ఉన్నా లేకుండా బీజేపీ పార్టీ గురించి పొగుడుతూ ఇన్ డైరెక్ట్ గా పార్టీ తో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పకనే చెప్తున్నారు.. అయితే చంద్రబాబు ఎన్నికలొచ్చినప్పుడు బీజేపీ ని విమర్శించడం అక్కడ చేతులు కాల్చుకోవడం ఆ తర్వాత బీజేపీ పంచన చేరుతాననడం బీజేపీ నేతలు గమనిస్తూనే ఉన్నారు..

ఇప్పుడు బీజేపీ నేత‌లెవ‌రికైనా కాళ్లో ముళ్లు గుచ్చుకుంటే చంద్ర‌బాబు నాయుడు విల‌విల్లాడిపోతూ ఉన్నారు.  ఇలా క‌మ‌లం పార్టీ కాళ్ల ముందు సాగిలాప‌డుతున్నారు చంద్ర‌బాబు నాయుడు. ఇది జ‌నాల‌కు అర్థం అవుతోంది. అయితే సోము వీర్రాజు మాత్రం చంద్ర‌బాబును ఇంకా కాంగ్రెస్ మ‌నిషిగానే చూస్తూ ఉన్నారు. సొంతంగా ఎద‌గాల‌నే ఆస‌క్తి ఉంటే, చంద్ర‌బాబును బీజేపీ ద‌గ్గ‌ర‌కు చేర‌నీయ‌క‌పోవ‌డం మన పార్టీకే మంచిదని చెపుతున్నారట.. చంద్ర‌బాబుతో పెట్టుకున్న స్నేహం అనుకున్న ఏ పార్టీ అయినా అంత‌కంత‌కు కూరుకుపోవ‌డ‌మే కానీ ఎదిగిన దాఖ‌లాలు లేవని ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు ను బీజేపీ గేటు కూడా దాటనివ్వొద్దని చెపుతున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: