
బిర్యానీ తయారీలో ఉపయోగించే మాంసం, బియ్యం, వంట పద్ధతి ద్వారా అనేక విధానాలు ఉన్నాయి. కాగా, బిర్యానీ కేలరీల సంఖ్య మాంసం రకంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. బిర్యానీ మసాలాతో కూడిన రుచికరమైన భారతీయ వంటకం. దీనిలో పుష్కలమైన క్యాలరీలు ఉంటాయి. 200 గ్రాముల బిర్యానీలో సగటున 290 కేలరీలు ఉంటాయి.
ఇక మంచి ఆహారం మానసిక స్థితిని పెంచుతుందన్న విషయం తెలిసిందే. అయితే, బిర్యానీ దానిని రుజువు చేస్తుంది. బిర్యానీ తిన్న తర్వాత మనిషికి ఎంతో ఉత్సాహం వస్తుంది. తద్వారా నూతనోత్తేజంతో పనులు చేయవచ్చు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో విరివిగా ఉపయోగించే పదార్థాలను బిర్యానీ తయారీలో ఉపయోగిస్తారు. తద్వారా ఇది రుచి కలిగిన రెసిపీగా పని చేస్తుంది.
అయితే సుగంధ ద్రవ్యాలు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. బిర్యానీ తయారీలో వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, కుంకుమ, పసుపు, నల్ల మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను విరివిగా వాడతారు. బిర్యానీని మాంసంతో తయారు చేస్తారు. దీనివల్ల మీ బిర్యానీ వంటకంలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇక చికెన్ వంటి మాంసంలో తక్కువ కేలరీలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అందువల్ల బిర్యానీని మితంగా తినడం చాల మంచిది. జీలకర్ర, పసుపు, నల్ల మిరియాలు, అల్లం వంటి వివిధ మసాలా దినుసుల మిశ్రమం బిర్యానీని రుచికరంగా మార్చడమే కాకుండా, మీ శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది. అంతేకాక, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది