తెలంగాణలో బిజెపి రాష్ట్ర స్థాయి నాయకులు కొంతమంది ప్రచారం చేసుకునే విషయంలో వెనకబడి ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని ఎక్కువ ప్రచారం చేసుకో లేకపోవడం  ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రధానంగా బస్తీ ప్రాంతాల్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారం చేసుకోలేకపోతున్నారు. టిఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు అందరూ కూడా ప్రచారం చేస్తున్న సరే వీళ్ళు మాత్రం వెనుకబడి ఉన్నారు. దీనివలన పార్టీ ఎక్కువగా నష్టపోతుంది అనే భావన బీజేపీ కార్యకర్తలలో కూడా వ్యక్తమవుతుంది.

ప్రస్తుతం పరిస్థితి చూస్తే టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అనే భావన చాలా మందిలో ఉంది. కేంద్ర మంత్రులు ప్రచారం చేయడం కూడా భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా ఇబ్బందికరంగా మారింది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది. టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసుకునే విషయంలో ప్రతి ఒక్క ఘోరంగా విఫలమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లలేక పోతున్నారు అనే భావన చాలా మందిలో ఉంది.

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కొన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. వాటి వలన బస్తీ ప్రాంతాల్లో ఉండే వారు ఎక్కువగా లబ్ది పొందుతున్నారు. కాబట్టి వాటిని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్లలేకపోతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విషయంలో బీజేపీ నేతలు సమర్థవంతంగా వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు అనే భావన కూడా వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి కేంద్రంలో ఉన్న బిజెపి నేతలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఐటి ఈడీ విచారణకు ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు అని పలువురు ప్రశ్నలు వేస్తున్నారు. మరి దీనికి బీజేపీ నేతలు ఎలా సమాధానం చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: