ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కరోనా వైరస్ నిర్మూలన విషయంలో జగన్ మంచి ఘనత అందుకొని పలువురికి ఆదర్శంగా నిలిచారు.ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ  భారీగా తగ్గిపోయాయి. అలాగే జగన్ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు కోటి మందికి పైగా నిర్వహించడం జరిగింది. అలాగే ప్రభుత్వం మరో శుభవార్త  కూడా అందించింది. ఆదివారం భారీ సంఖ్యలో డిశ్చార్జిలు అవ్వడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 8 వేలకు తగ్గిపోయింది. ఆదివారం కొవిడ్ 19 టెస్టులు భారీగానే నిర్వహించినా, కేసులు మాత్రం అత్యల్ప స్థాయికి తగ్గిపోయాయి. మరణాలు సైతం తక్కువగానే నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో 54,710 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 620 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,67,683కి చేరింది.

అలాగే కరోనా మరణాలు కూడా స్వల్పంగా పడిపోయాయి. శనివారం కరోన వైరస్ బారిన పడి ఏడుగురు చనిపోయారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, గుంటూరులో ఒకరు కరోనాతో చనిపోవడం జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్  బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 6,988కు చేరింది.
అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు ఆదివారం భారీగా జరిగాయి. ఇటీవలి కాలంలో డిశ్చార్జిలు ఇంత భారీ సంఖ్యలో నమోదు కావడం మొదటిసారి కావడం విశేషం. ఆదివారం 3,787 మంది కోవిడ్‌ 19 నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,52,298 మంది కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 8,397కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,00,17,126 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇంకా ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: