తన నియామకానికి ముఖ్య కారణమైన వారి ఋణం చెల్లించుకోవడానికి నిమ్మగడ్డ రమేష్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న తన అధికారాలను ఉపయోగించుకుని చేసిన అన్యాయాలను అందరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. వివాదమే మార్గంగా అయన వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాఫ్తంగా చర్చనీయంశంగా మారిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి ఏ ఒక్క విషయంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయలేదు. ఎడ్డం అంటే తెడ్డం అంటూ పాలనను సరిగ్గా చేయనీకుండా పదిరోజులకోసారి ఎన్నికల ప్రస్తావన తెస్తూ చికాకు పెట్టిస్తున్నారు. కరోనా సమయంలో ఎన్నికలు కావాలని మంకు పట్టు పట్టి నానా రాద్ధాంతం చేస్తున్నాడు.

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసిపీ నేతలు చేసిన ఆరోపణలను నిజం చేసే విధంగా అయన వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాలు కూడా ఓ అంచనా కి వచ్చేశాయి. ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసి అసలు ప్రభుత్వం పై తనకు ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పకనే చెప్పాడు. ఈయనతో వేగలేదనే వైసీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ ని తప్పించి రిటైర్డ్ జడ్జ్ కనకరాజన్ ని ఎన్నికల అధికారిగా నియమించింది..  అయితే కోర్టు ద్వారా మళ్ళీ తన పదవిని దక్కించుకున్న నిమ్మగడ్డ అప్పట్నుంచి తన ప్రతాపాన్ని ప్రభుత్వంపై చూపుతున్నారంటున్నారు. దాదాపు ఆరునెలలు అటు కోర్టు సమయాన్ని, ఇటు ప్రభుత్వ సమయాన్ని, ధనాన్ని ఖర్చు చేసి ఆయన చివరికి సాధించింది ఏమిటి అంటే ఏమని చెప్పాలి.. 

ఇకపోతే తాజాగా కోర్టు లో తనకు చుక్కెదురు కావడంతో తన పదవీకాలం పెంచుకునే విధంగా నిమ్మగడ్డ ప్రయత్నాలు మొదలుపెడుతున్నాడని తెలుస్తుంది. జగన్‌ ప్రభుత్వం తనను మూడు నెలల పాటు తన విధులు నిర్వర్తించకుండా తప్పించింది కాబట్టి, ఆ మూడు నెలల పదవీ కాలాన్ని పెంచాల్సిందిగా నిమ్మగడ్డ కోర్టు ముందు వాదించుకోవడానికి సిద్ధమైనట్లుగా భావిస్తున్నారు. ఒక వేళ ఆయన ధోరణి ఇదే గనుక అయితే పైన చెప్పుకున్నట్లు గొడవ.. వివాదమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు ఖరారు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: