పాకిస్తాన్లో పరిస్థితి రోజు రోజుకు మరింత ఘోరం గా మారి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఉగ్ర వాదంతో ప్రపంచ దేశాల పై ఆధిపత్యం సాధించి మత రాజ్య స్థాపన చేయాలి అనుకున్న పాకిస్తాన్ కు ప్రస్తుతం ఉగ్రవాదమే ఒక పెద్ద సమస్యగా మారి పోతుంది అని చెప్పాలి. మత  రాజ్య స్థాపన పేరుతో ఎంతో మంది యువతను రెచ్చగొట్టి  అక్కడి ప్రభుత్వం ఏకం గా ఉగ్రవాదం వైపు నడిచే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.  సాధారణం గా పాకిస్థాన్లో యువతకు ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండవు.



 ఈ క్రమం లోనే ఇక ఉగ్రవాదం లో చేరితే ఎంతో కొంత డబ్బులు వస్తాయి అనే భావన యువతలో కల్పించడమే కాదు.. ఇక యువతలో మత విద్వేషాలు రెచ్చ గొడుతూ ఉగ్ర వాదం వైపు నడిపించడం తో భారీ మొత్తం లో యువత పాకిస్థాన్ ప్రభుత్వం ఐఎస్ఐ చెప్పిన విధంగా ఉగ్రవాద సంస్థల్లో  చేరి ట్రైనింగ్ తీసుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి లో మార్పు వచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు.. ఉగ్రవాద సంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై అక్కడ యువతలో అవగాహన వచ్చింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ప్రభుత్వానికి ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా ఏర్పాటవుతున్నటువంటి సంస్థల్లో  పెద్ద ఎత్తున పాకిస్తాన్ యువత చేరుతున్నారట.



 ఇస్లామిక్ రాజ్యస్థాపనకు వ్యతిరేకంగా తీవ్రవాద సంస్థలు చేసే అరాచకాలకు వ్యతిరేకంగా ఎంతో  యువత ప్రస్తుతం బెలూన్ ఆర్మీలో చేరడంతో పాటు.. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడుతున్న పలురకాల సంస్థలలో కూడా పెద్ద ఎత్తున చేరుతున్నట్లు తెలుస్తుంది. ఇది కూడా ఎవరో చెప్పింది కాదు ఏకంగా అక్కడ ఉన్న ఐఎస్ఐ గుర్తించి ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించింది. పాకిస్తాన్ లో ఇలాంటివి మొదటిసారి జరుగుతున్న నేపథ్యంలో ఇది అక్కడి ప్రభుత్వానికి పెద్ద సంక్షోభం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: