స్థానిక సంస్థల ఎన్నికలు చాలా పెద్ద పనే చేయబోతున్నాయిట. ఈ ఎన్నికలు మామూలువి కావు, వీటి ఫలితాలు కూడా అంత లైట్ గా తీసుకోవాల్సింది లేదుట. దీని వల్ల జగన్ సర్కార్ కూలిపోతుందా. లేక మిన్ను విరిగి మీద పడుతుందా అంటే కానే కాదు. అంతకంటే పెద్ద ముప్పే ఉందని అంటున్నారు.

అదేంటి అంటే స్థానిక ఎన్నికల ఫలితాలు మూడు రాజధానుల ముచ్చట మీద జనాల అభిమతాన్ని కచ్చితంగా చెబుతాయి. ప్రత్యేకించి విశాఖకు రాజధానిని జగన్ సర్కార్ ప్రతిపాదించింది. అందువల్ల విశాఖతో సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో స్థానిక ఎన్నికలలో వైసీపీ జెండా ఎగరకపోతే అది జగన్ కలల రాజధానిని  బహు దూరం చేస్తుంది.

విశాఖ జనం మద్దతు రాజధానికి లేదు అని నిర్ధారిస్తారు. ఇప్పటిదాకా జగన్ చేసిన దానితో పాటు  పడిన శ్రమ అంతా ఒక్క దెబ్బకు కొట్టుకుపోతాయి. అందుకే స్థానిక ఎన్నికల్లో కచ్చితంగా ఉత్తరాంధ్రా మీదనే జగన్ దృష్టి ఉందని అంటున్నారు. అదే విధంగా ఈ మూడు జిల్లాల ఫలితాలు కూడా వైసీపీకి చాలా ప్రాధాన్యతగా ఉంటాయని కూడా చెబుతున్నారు.

సరిగ్గా ఇదే పాయింట్ మీద టీడీపీ దాని అధినేత చంద్రబాబు కూడా ఉన్నారు. విశాఖ జనాలు రాజధానిక్ వ్యతిరేకమని చెప్పాలంటే స్థానిక ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావాలి. మూడు జిల్లాలలో ఇప్పటికీ టీడీపీ బలంగా ఉంది. దాంతో స్థానికంలో పై చేయి సాధించడం ద్వారా జగన్ మూడు రాజధానుల ఆటకు దెబ్బ కొట్టాలని బాబు మాస్టర్ ప్లాన్ తో రెడీ అవుతున్నారు. మొత్తం ఈ పరిణామాలు చూసుకుంటే అన్ని చోట్ల గెలుపు ఒక ఎత్తు ఉత్తరాంధ్రాలో మరో ఎత్తు అన్నట్లుగా సీన్ ఉందని అంటున్నారు. దీంతో రెండు పార్టీలు తమ వ్యూహాలను, అస్త్ర శస్త్రాలను కూడా ఈ మూడు జిల్లాల మీదనే పూర్తిగా పెట్టబోతున్నాయని అంటున్నారు. మరి స్థానిక సమరంలో  ఎవరికి కేక్, మరెవరికి షాక్ అన్నది చూడాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: