అడవి పందులు పంటను నాశనం చేయడానికి వచ్చిన సమయంలో ఇక వాటిని గుర్తించి సర్పంచ్ కి సమాచారం అందిస్తే సర్పంచ్ లైసెన్స్ గన్ ఉన్న వారికి సమాచారం అందించి వాటిని షూట్ చేసి చంపేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇక చంపిన తర్వాత వాటి కళేబరాలను కూడా భూమిలో పాతి పెట్టాలని.. అమ్మడం లాంటివి చేస్తే కఠిన శిక్షలు పడతాయి అంటూ హెచ్చరించింది. ఇక ఇటీవల దీనిపై మరోసారి ప్రజలకు పలు సూచనలు కూడా చేసింది తెలంగాణ ప్రభుత్వం. పంటను నాశనం చేయడానికి వస్తున్న అడవి పందుల బెడద ను అడ్డుకునేందుకు.. పంట చుట్టూ కరెంటు వైర్లు ఏర్పాటు చేయడం లేదా ఉచ్చు పెట్టడం లాంటివి మాత్రం అస్సలు చేయకూడదు అంటూ హెచ్చరించింది.
పంటను దెబ్బతీయడానికి వచ్చిన పందులను నివారించేందుకు పంట చుట్టూ కరెంటు వైర్లు ఏర్పాటు చేయడం ఉచ్చు ఏర్పాటు చేయడం లాంటివి అస్సలు చేయకూడదు అని అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ ఇటీవల వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం పంటను నాశనం చేసిన అడవి పందులను గుర్తించి సర్పంచ్ కి సమాచారం అందించి లైసెన్సు గన్ తో మాత్రమే కాల్చి చంపాలి అంటూ సూచించారు. ఇక సర్పంచ్ కూడా కేవలం రైతుల ఫిర్యాదు మేరకు మాత్రమే చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాలి అంటూ అటవీశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి