అయితే.. భారత్ దగ్గరున్న రాఫెల్ యుద్ద విమానాలను చూసి చైనా షాకయ్యిందట. చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు చూసి చైనా ఆందోళన చెందిందట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. భారత వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా. ఆయన తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. సరిహద్దు పరిస్థితులను ఆయన ఆ టీవీ ఛానల్ ప్రతినిధికి వివరించారు. రాఫెల్ యుద్ధవిమానాల రాకతో భయాందోళనకు గురైన చైనా చివరకు తన వద్ద ఉన్న జే-20 యుద్ధ విమానాలను భారత సరిహద్దుల్లోకి తరలించిందట.
అందుకే ఇండియా కూడా సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సంసిద్ధంగా ఉందని ఆర్కేఎస్ భదౌరియా అంటున్నారు. అయితే ఇరు దేశాల మధ్య యుద్దం వచ్చే పరిస్థితి ఉందని తాను భావించడం లేదని ఆయన అంటున్నారు. ఇరుదేశాల.. సైన్యాధికారుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని.. అవి సఫలం అవుతాయని ఆశిస్తున్నానని భదౌరియా అన్నారు.
మొత్తానికి భారత్ విదేశాల నుంచి రప్పించుకున్న రాఫెల్ యుద్ధవిమానాలు మన సైన్యం ఆత్మవిశ్వాసాన్నిరెట్టింపు చేశాయన్న మాట. చైనా ఇండియా సరిహద్దుల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రత్యేకించి ఇండియాను దెబ్బ కొట్టేందుకు సరిహద్దుల్లో భారీగా రక్షణ సామాగ్రి సమకూర్చుకుంటోంది. అలాంటప్పుడు ఇండియా ఆమాత్రం జాగ్రత్త పడకపోతే ఎలా..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి