సాధారణంగా ఎవరైనా నేరం చేసిన తర్వాత ఇక పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన సమయంలో అతడు ఎంతో టెన్షన్ పడి పోతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. కోర్టులో జడ్జి ఎలాంటి తీర్పు ఇస్థారోనని  ఎంతో కంగారు పడి పోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం అలా కంగారు పడి పోలేదు. కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందోనని అన్నది పక్కన పెట్టేసి ఇక కోర్టులో విచారణ జరుగుతున్న సమయం లోనే  పులిహోర రాజా గా మారిపోయాడు ఇక్కడొక నేరస్తుడు. అందరూ చూస్తుండగానే ఏకంగా జడ్జిని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించాడు.




 మీరు చాలా అందంగా ఉన్నారు .. ఐ లవ్ యూ అంటూ అందరి ముందు చెప్పేయడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.  ఐ లవ్ యూ అంటూ బిస్కెట్ వేసినప్పటికీ ఆ జడ్జి మాత్రం దిమ్మతిరిగే తీర్పు ఇచ్చింది. ఈ ఘటన ఫ్లోరిడాలో వెలుగులోకి వచ్చింది. కరోనా  వైరస్ నేపథ్యంలో బ్రావర్డు  కౌంటీలో కోర్టు సమావేశాలను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.  ఈ క్రమంలోనే  చోరీ కేసులో అరెస్ట్ అయిన లూయిస్ అనే నిందితుడిని జూమ్  మీటింగ్ ద్వారా కోర్టు విచారణకు హాజరు పరిచారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో జూన్ మీటింగ్ లోనే లాయర్లు అతడు చేసిన నేరాన్ని జడ్జికి వివరించారు.


 ఈ క్రమంలోనే లూయిస్ నేరం గురించి మాట్లాడకుండా జడ్జితో పులిహోర కలపడానికి ప్రయత్నించాడు. మీరు చాలా బాగున్నారు..  ఎంతో అద్భుతంగా ఉన్నారు అన్నది నేను చెప్పాలనుకుంటున్నా ఐ లవ్ యు అంటూ నేరస్తుడు చెప్పాడు.  ఇక నేరస్తుడు చెబుతుంటే ముసిముసిగా  నవ్వు కున్న జడ్జి అతనికి కౌంటర్ ఇచ్చింది. ఇలా పొగడ్తలతో పడేయడం ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ ఇది కోర్టు  ఇక్కడ ఇలాంటివి పనిచేయవు అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు అతనికి ఐదు వేల డాలర్ల జరిమానా కూడా విధించింది జడ్జి. దీంతో నిందితుడు షాక్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: