ఆంధ్రప్రదేశ్ లో గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణంపై రాజకీయ పార్టీలన్నీ కూడా ఆసక్తికరంగా చూస్తునాయి. అయితే గంటా శ్రీనివాసరావు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోయినా సరే ఆయన మాత్రం కచ్చితంగా అధికార వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు విషయంలో చాలా వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కచ్చితంగా గంటా శ్రీనివాసరావు పార్టీ మారే అవకాశాలున్నాయని బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం గంటా శ్రీనివాసరావు విషయంలో చాలా వరకు కూడా అప్రమత్తం అవుతుందనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు ఇప్పుడు మాత్రం తన రాజకీయ ప్రయాణం విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి... గంటా శ్రీనివాసరావు త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉంది. అయితే ఆయన ఏ పార్టీలో చేరకుండా సొంత గానే ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నిక విశాఖ ఎంపీ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఆయన విషయంలో భారతీయ జనతా పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆయన మాత్రం పార్టీ మారే అంశం గురించి ఇప్పటి వరకు కూడా స్పష్టత ఇవ్వలేదు. మారకపోతే మాత్రం కచ్చితంగా ఆయనను ఆకట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే మాత్రం కేంద్ర మంత్రి పదవి ఆయనకు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: