వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని కేవలం శాసన రాజధానిగా మాత్రమే కొనసాగిస్తామని. అంతే కాకుండా ఏపీకి మొత్తం మూడు రాజధానులను ఏర్పాటు చేసే దిశగా రాజదాని వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చారు. అయితే ప్రతిపక్షంతో సహా మిగతా పార్టీల నుండి వ్యతిరేకత ఏర్పడడంతో కొన్ని వివాదాల నడుమ ఈ అంశం కోర్టులో ఉంది. అయితే ఈ విషయంలో చాలా సందర్భాలలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మధ్యన ఎన్నో సవాళ్లు జరిగాయి. కానీ ఎక్కువ శాతం ప్రజలు మాత్రం ఆ మూడు రాజధానుల అంశానికి సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత... ప్రజల్లో కొంత అసంతృప్తి కలిగిన మాట వాస్తవమే. దీనితో వైసీపీ తరువాత ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా వైసీపీకి ప్రజలు సరైన బుద్ధి చెబుతారని ప్రతిపక్ష పార్టీలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా వైసీపీకి పూర్తి ఆధిక్యాన్ని ఇచ్చి టీడీపీకి బుద్ధి చెప్పారు.
దీనితో ప్రజల మనసులో ఉన్న నాయకులని ఎవ్వరూ చెదరగొట్టలేరని ప్రజలు నిరూపించారు. తరువాత గత వారంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఎన్నో ఆసక్తికర పరిణామాల మధ్యన జరిగాయి. ఈ రోజు దీనికి సంబంధించిన ఫలితాలు వెలువడుతుండడంతో, ఈ ఫలితాలలో కూడా వైసీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ప్రస్తుతానికి 75 మున్సిపాలిటీలలో 62 ను సొంతం చేసుకుంది. మరియు 12 కార్పొరేషన్ లకుగానూ 8 కార్పొరేషన్ లను సొంతం చేసుకుంది. ఈ ఫలితంతో మూడు రాజధానుల అంశానికి ప్రజలు మద్దతిచ్చినట్లే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీ వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రజలంతా ఈ ఫలితంతో మూడు రాజధానులు అనుమతి ఇచ్చారని తమ సంతోషాన్ని వెలిబుచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి