ప్రపంచదేశాలలో కొన్ని సమయాలలో వివిధ కారణాల వలన వివాదాలు జరగడం చూస్తూ ఉంటాము. అయితే ఈ వివాదాలు చర్చలతో ఆగిపోతే పరవాలేదు. కానీ కొన్ని కొన్ని సార్లు యుద్ధం వరకు వెళుతూ ఉంటాయి. గత సంవత్సరం నుండి భారతదేశానికి చైనా దేశానికి మధ్య జరిగిన సరిహద్దు వివాదం ఎంత దూరం వెళ్లిందో మనకు తెలిసిందే. ఒకానొక దశలో యుద్ధం జరుగుతుందా అనే అనుమానాలు రేకెత్తించింది ఈ వివాదం. ఇప్పుడు ఇదే విధంగా కొన్ని రోజుల నుండి రష్యా కు మరియు ఉక్రెయిన్ కు మధ్యన వివాదం జరుగుతూ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే...రష్యా దేశం ఉక్రెయిన్ ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగానే రష్యా సాయుధ దళాలు ఉక్రెయిన్ ని చుట్టుముట్టాయి. ఇటువంటి సమయంలో రష్యా చర్యను తప్పు పట్టి ఒకవైపు ఉక్రెయిన్ కు సపోర్టుగా అమెరికా, నాటో మరియు యూరోపియన్ యూనియన్ రష్యా దళాలను వెనక్కు వెళ్లాలని చెబుతున్నా కూడా వారి మాటన పెడచెవిన పెట్టి..రష్యా ఈ దురాగతానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కొంతమంది ఉక్రెయిన్ సైనికుల్ని కాల్చి చంపడం జరిగింది. ఎంతకీ రష్యా వెనక్కి తగ్గకపోవడంతో రష్యా ను ఎలాగైనా నిలువరించాలని ప్రపంచ దేశాలు ఆంక్షలు పెట్టడం ప్రారంభించాయి. ఈ ఆంక్షలు ఎలా ఉన్నాయంటే ఆర్థికపరమైన ఆంక్షలను పెట్టి రష్యాను వెనక్కి మళ్లేలా చేయాలని ప్రయత్నిస్తున్నాయి.  ఈ దురాగతానికి కారణమయిన 38 మంది రష్యన్ అధికారుల పైన అంతర్జాతీయ నిషేధాన్ని విధించింది. ఈ మూడు కూటములు కలిపి రష్యా కి సంబంధించిన అన్ని ఆర్ధికపరమయిన అనుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

మరియు ప్రపంచం నలుమూలల ఉండే రష్యా రాయబారులను ఆయా దేశాలు వెనక్కు పంపుతున్నారు. అతి ముఖ్యంగా యూరోపియన్ దేశాల నుండి మరియు అమెరికా నుండి వీరిని వెనక్కి పంపుతున్నారు. అంతే కాకుండా బ్రిటన్ దేశం అయితే అక్కడ ఉన్న రష్యా రాయబారికి సమన్లు ఇచ్చింది. అంటే ఒకసారి వచ్చి ప్రభుత్వాన్ని కలవమని ఆర్డర్ ఇచ్చింది. దీని వలన రష్యా ను అవమానపరిచినట్లే అయింది. ఇటువంటి ఆర్ధిక ఆంక్షల నడుమ రష్యా మళ్ళీ పాత పద్ధతిలోకే వెళుతుందా...? లేదా చైనా రష్యా కి మద్దతుగా నిలబడి యుద్దానికి కారణమవుతుందా చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: