
ముంబైలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపధ్యంలోనే మలబార్ హిల్ సేవక్ జట్టా & ములుండ్ సిక్కు యువత ఆక్సిజన్ సిలిండర్ కోసం చూస్తున్న వారికి సహాయం చేయడానికి కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. గత సంవత్సరం, మేము 3 నెలలు లాంగర్ నిర్వహించాము, కాని ఈసారి ఆక్సిజన్ భయం ఉంది కాబట్టి మేము రెడ్ క్రెసెంట్ సొసైటీని కనెక్ట్ చేసి ప్రజలకు సహాయం చేయడం ప్రారంభించామని సిక్కు యువత స్వచ్ఛంద సేవకుడు బల్విందర్ సింగ్ పేర్కొన్నారు. ఇది ఉచిత ఖర్చుతో కూడిన సేవ అని మేము సిలిండర్ డిపాజిట్ కోసం ప్రజల నుండి 6000 రూపాయలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తిరిగి సిలిండర్ అప్ప చెప్పినప్పుడు ఆ డబ్బు తిరిగి ఇస్తామని అన్నారు. ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చే ముందు మేము రోగుల నివేదిక మరియు ప్రిస్క్రిప్షన్‌ను తనిఖీ చేస్తామని బల్విందర్ సింగ్ పేర్కొన్నారు. ఇక ఇక్కడ అనే కాదు కొవిడ్-19 రోగులకు సహాయపడేందుకు ఘజియాబాద్ గురుద్వారా కూడా కొద్ది రోజుల క్రితం ‘ఆక్సిజన్ లాంగర్’ ను ప్రారంభించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ -19 కేసుల నేపథ్యంలో ఘజియాబాద్ ప్రజలను ఆదుకునేదుకు ఇందిరాపురంలోని గురుద్వార సమితి ప్రాణాలను రక్షించే ఆక్సిజన్ వాయువు కొరత తీర్చేందుకు నడుం బిగించారు. ప్రతి నిత్యం అన్నప్రసాద లాంగర్ నిర్వహించడానికి బదులుగా ప్రత్యేకమైన “ఆక్సిజన్ లాంగర్” ను ప్రారంభించారు.
అసలు లాంగర్ అంటే ఏంటి
ఇది సిక్కుల చేత నడపబడే ఉచిత కిచెన్. ఈ లాంగర్ పూర్తిగా స్వచ్ఛంద సేవ , నిస్వార్థ సేవ. ప్రతిరోజూ వేలాదిమంది ప్రజలు భారతదేశంలోని అమ్రిత్సర్ లోని హర్మందిర్ సాహిబ్ బంగారు దేవాలయాన్ని సందర్శిస్తారు. వారికి అక్కడ ఉచిత భోజన సేవ లభిస్తుంది. అలానే అనేక ప్రాంతాల్లో సిక్కులు ఇలాంటి లాంగర్ లు నడుపుతున్నారు.