తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నాడు మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం భూ కబ్జాకి పాల్పడ్డారనే ఆరోపణలతో ముందుగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కాబడిన ఈటల రాజేందర్ ఇప్పుడు ప్రభుత్వం మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ తర్వాత స్టెప్ ఏమిటి అనే దాని మీద విపరీతమైన చర్చ జరుగుతోంది.. 


ఈ సమయంలో టీఆర్ఎస్ కు దూరమై రెబల్ ఎంపీగా ఉన్న డి శ్రీనివాస్ తో ఈటల రాజేందర్ భేటీ కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుమారు గంటన్నర పైగా డిఎస్ ఈటల మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. భవిష్యత్తులో ఏమి చేయాలి అనే విషయం మీద ఈటల డిఎస్ తో చర్చించినట్లు చెబుతున్నారు. ఇక త్వరలో తాను భవిష్యత్ కార్యాచరణ ఏమిటో వెల్లడిస్తానని ఇటీవల ఈటల ప్రకటించిన సంగతి తెలిసిందే. 


ఈ నేపథ్యంలో తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని పలువురు నేతలను కలిసి వారి మద్దతు కోరుతున్నానని ఈటల రాజేందర్ చెబుతున్నారు. నిజానికి మంగళవారం ఈటెల రాజేంద్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తో కూడా భేటీ అయ్యారు. చాలా సేపు ఆయన విక్రమార్క తో చర్చలు జరిపారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారని ఊహాగానాలు సైతం వెలువడ్డాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించి అనంతరం టీఆర్ఎస్ లో చేరిన డి ఎస్ ప్రస్తుతానికి టెక్నికల్ గా టిఆర్ఎస్ ఎంపీగానే కొనసాగుతున్న భౌతికంగా మాత్రం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ ఇద్దరు మాజీల భేటీ, ఇప్పుడు టీఆర్ఎస్ నేతలకు టెన్షన్ గా మారిందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: