వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజుపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని మ‌రోసారి లోక్‌స‌భ స్పీక‌ర్‌ని ఆ పార్టీ ఎంపీలు క‌లిశారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి,రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్‌,రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డిలు స్పీక‌ర్ ఓంబిర్లాతో స‌మావేశ‌మైయ్యారు.ర‌ఘురామ‌కృష్ణం రాజు అన‌ర్హ‌త పిటిష‌న్‌కు సంబంధించి మ‌రిన్ని ఆధారాల‌ను స్పీక‌ర్‌కు అందించిన‌ట్లు విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.వైసీపీలో ఎంపీగా గెలిచిన ర‌ఘురామ‌కృష్ణం రాజు ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై తిరుగుబాటు చేస్తున్నారు. ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ర‌ఘురామ‌రాజు త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తు వ‌స్తున్నారు.అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ రాజ‌ధాని అమ‌రావ‌తిగా ఉండాల‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజు తెల్చి చెప్పారు.

ఆ త‌రువాత జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌న్నీ ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలంటూ ప్ర‌తి రోజు రాజ‌ధాని ర‌చ్చ‌బండ పేరుతో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించేవారు. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌తి రోజు ఏదో ఒక‌ర‌కంగా విమ‌ర్శిస్తూ ఉండేవారు.ఆ త‌రువాత జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ర‌ఘురామ‌రాజు పిటిష‌న్ వేయ‌డంతో వివాదం ఇంకా ముదిరింది. దీంతో ర‌ఘురామ‌కృష్ణం రాజుపై సీఐడీ అధికారులు కేసులు న‌మోదు చేశారు.త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా హైద‌రాబాద్ వ‌చ్చిన ర‌ఘురామ‌కృష్ణం రాజుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు.ర‌ఘురామ‌రాజుని పోలీస్ క‌స్ట‌డీలో కొట్టారంటూ ఫిర్యాదు చేశారు.సుప్రీంకోర్టులో ర‌ఘురామ‌కృష్ణం రాజు పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

త‌న‌ను పోలీసులు విచార‌ణ పేరుతో వేధించార‌ని కోర్టుకు వెళ్ల‌డంతో ఆర్మీ ఆసుప‌త్రిలో చికిత్స అందించింది కోర్టు నివేదిక‌ను కోరింది.  ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామ‌ల‌తో ర‌ఘురామ‌రాజు సీఎం జ‌గ‌న్‌ని ఇరుకున పెట్టే ప‌నిలో ఉన్నారు. ఏపీ పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును కేంద్ర‌మంత్రుల‌కు వివ‌రించారు.ఆ త‌రువాత త‌న స‌హ‌చ‌ర ఎంపీలంద‌రికి త‌న‌పై జ‌రిగిన దాడిని పార్ల‌మెంట్‌లో లేవ‌నెత్తాల‌ని లేఖ‌లు రాశారు. రాష్ట్రంలో ప్ర‌తి స‌మ‌స్య‌పై సీఎం జ‌గ‌న్‌కు ర‌ఘురామ‌రాజు లేఖ రాస్తూ వ‌స్తున్నారు.పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీలను అమ‌లు చేయాలంటూ లేఖ‌లో కోరుతున్నారు.ఇదంతా ఇలా జ‌రుగుతుంటే ర‌ఘురామ‌కృష్ణం రాజుపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ ఎంపీలు స్పీక‌ర్ చుట్టూ తిరుగుతున్నారు. మ‌రి స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: