ఇటీవలి కాలంలో మహిళలు అడుగడుగున  అదనపు కట్నం వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అంతే కాదు ఎంతో మంది ఆడ పిల్లలను ఇక అదనపు కట్నం కోసం భర్త వేధిస్తూ ఉండటంతో తీవ్ర చిత్రహింసలకు గురి అవుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే మహిళను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇక ఆ తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని అంటూ వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఇక చిన్నపాటి వివాదం తలెత్తడంతో ఏకంగా భార్య ను చితకబాదిన తో పాటు ఆమె తండ్రిని కూడా దారుణంగా దాడి చేసి పక్కకు ఎముకల విరగొట్టాడు. ఈ దారుణ ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది.


 ఇటీవల కేరళ ప్రభుత్వం వరకట్న నిషేధం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇక దీనిపై విస్తృత ప్రచారం కూడా చేపడుతుంది. ఇలాంటి సమయంలోనే అటు కేరళలో వరకట్న వేధింపులు మాత్రం రోజుకు ఎక్కువవుతున్నాయి. ఇటీవలే కేరళలోని కొచ్చి కి చెందిన ఒక మహిళను ఏప్రిల్ 12వ తేదీన ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు  అయితే వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. పెళ్లి అయిన నాటి నుంచి పెళ్లి కావాలని మహిళలు వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు. అయితే ఇక అదనపు కట్నం ఇవ్వము అంటూ అటు మహిళ తల్లిదండ్రులు తెగేసి చెప్పారు.



 దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు సదరు వ్యక్తి. ఏకంగా భార్యకు అన్నం పూర్తిగా బంద్ చేశాడు. అంతేకాకుండా అదనపు కట్నం ఇవ్వకపోతే దారుణమైన పరిస్థితులు ఉంటాయి అంటూ భయాందోళనకు గురి చేయడానికి ప్రయత్నించారు  ఇక ఇటీవలే మహిళకు అన్నం పెట్టకుండా ఇంట్లో నుంచి గెంటేశాడు. అయితే మహిళ తండ్రి  అల్లుడుతో చర్చించేందుకు వెళ్లగా దారుణంగా దాడి చేసి ఏకంగా పక్కటెముకలు విరిగేలా కొట్టాడు. ఇక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: