భారత్ నేపాల్ దేశాలు ఎన్నో దశాబ్దాల నుంచి సోదర దేశాల గానే కొనసాగుతూ వస్తున్నాయి. ఇక భారత్ ఎప్పుడూ నేపాల్ కి ప్రతి విషయంలో అండగా నిలబడుతుంది  ఇక ఆర్థిక సహాయం కూడా చేస్తూ వస్తోంది. కానీ ఇటీవలి కాలంలో మాత్రం సోదర దేశాలుగా ఉన్న నేపాల్ భారత్ మధ్య శత్రుత్వం మొదలైంది  ఏకంగా మొన్నటి వరకు నేపాల్ ప్రధానమంత్రిగా ఉన్న ఓలి శర్మ  భారత్ ఫై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే చైనా ప్రోద్బలంతో  నేపాల్ ఏకంగా భారత్ ను శత్రుదేశం గా చూడటం మొదలు పెట్టింది.



 ఆ తర్వాత నేపాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి ఇక హోలీ శర్మ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదంతా జరగడానికి చైనా కారణం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే నేపాల్ అటు భారత్ఫై ఎంత కక్షపూరితంగా వ్యవహరించి నప్పటికీ..  భారత్ మాత్రమే నేపాల్ ను ఒక సోదర దేశంగానే చూస్తూ వచ్చింది. అయితే ఇక ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో కూడా భారత్ మరోసారి నేపాల్ కు అండగా నిలబడి తన సోదర భావాన్ని చాటుకుంది.



 ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో అధికార సంక్షోభం ఏర్పడింది. తాలిబన్లు అరాచకాలు సృష్టిస్తున్నారూ. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ లో ఎంతో మంది భారతీయులతో పాటు నేపాలీలు కూడా ఇరుక్కుపోయారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దీనంగా ఉండడంతో ఆఫ్ఘనిస్తాన్  లో ఇరుక్కుపోయిన నేపాలీ లను కాపాడాలి అంటూ ప్రపంచదేశాలను విజ్ఞప్తి చేసింది నేపాల్ ప్రభుత్వం. కానీ ఏ ఒక్క దేశం కూడా నేపాలీ లను ఆఫ్ఘనిస్తాన్  చెర నుండి విడిపించేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో భారత్ ముందుకు వచ్చింది.  ఏకంగా 147 మంది పౌరులను యుద్ధ విమానంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి నేపాల్ తీసుకు వచ్చింది.  ఇందులో 140 మంది నేపాలీలు ఉండగా ఏడు మంది భారతీయులు ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: