తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ఈ నెల 19 వ తేదీన అంటే వచ్చే ఆది వారం రోజున గణేష్‌ నిమజ్జన కార్యక్రమం జరుగనున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... గణేష్‌ నిమజ్జనం కార్యక్ర మం పై కీలక మార్గ దర్శకాలను విడుదల చేసింది.   గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పై అధికారుల తో  సమీక్ష నిర్వ హించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.   ఇక కీలక సమీక్ష లో మేయర్ విజయలక్ష్మి, సీపీ అంజనికుమార్, వివిధ శాఖల అధికారులు తదితదురులు హాజరయ్యారు..   ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడారు. 

భారత దేశం లోనే హైదరాబాద్ మహా నగరం  లో జరిగే గణేష్‌ ఉత్సవ వేడుకలు ప్రత్యేకమని స్పష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.  ఇక అన్ని శాఖల నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేశా మని చెప్పారు మంత్రి తలసాని.  ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా గణేష్‌ నిమజ్జనం  ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు.  దాదాపు 40 కి పైగా క్రేన్స్ ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేసామని స్పష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.

19 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని ... హైదరాబాద్  మహనగరం పరిధి లో 12 వేల మంది సిబ్బంది నిమజ్జన విధుల్లో పాల్గొంటారని ప్రకటించారు.. 25 బేబీ పాండ్స్ కూడా ఏర్పాటు చేసాం, వాటిలో కూడా నిమజ్జనం జరుగు తుందని వెల్లడించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.   ఉత్సవ కమిటీలు, ప్రజలు.. అధికారులకు సహకరించాలని కోరారు.  ఘనంగా నిమజ్జనం జరుపుకుంటామన్నారు మంత్రి తలసాని. ప్రతి ఒక్కరూ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ...  ప్రజలందరూ గణేష్‌ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. ఎవరికీ ఎలాంటి సమస్యలు తలెత్తిన స్థానిక పోలీసులకు చెప్పాలన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: