తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సరికొత్త ఛాలెంజ్ వచ్చింది. మొన్నటి వరకు టిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో... ప్రముఖుల తో మొక్కలు నాటించగా ఇప్పుడు... కొత్తగా తెరపైకి వచ్చింది వైట్ ఛాలెంజ్. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో... ఈ వైట్ చాలెంజ్  ను తెరపైకి తీసుకువచ్చారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతున్న సంగతి విధితమే. ఈ డ్రగ్స్ కేసులో చాలా మంది సినీ తారలు సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఈడీ ఇచ్చిన నోటీసులు మేరకు వరుసగా... విచారణకు హాజరు అవుతున్నారు సెలబ్రిటీలు.

ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.  టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు మంత్రి కేటీఆర్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అంతేకాదు తెలంగాణ గన్ పార్క్ వద్దకు వచ్చి... డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. వైట్ చాలెంజ్ పేరుతో ఈ సవాల్ కేటీఆర్ కు  విసిరారు రేవంత్ రెడ్డి. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన చాలెంజ్ ఓపెన్ స్పందించారు ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్.

తాను డ్రగ్స్ టెస్ట్  చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని... మరి రాహుల్ గాంధీ ఈ టెస్టులకు వస్తారా అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. రాహుల్ గాంధీ వస్తే తాను ఎక్కడికైనా వస్తానని అని సవాల్ విసిరారు కేటీఆర్. చర్లపల్లి జీవితం గడిపిన వ్యక్తులు  డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి రాహుల్ గాంధీని ఒప్పించాలని... పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. ఈ డ్రగ్స్ టెస్టులో... క్లీన్ చిట్ వస్థే... తన పదవి నుంచి రేవంత్ రెడ్డి వైదొలగాలని సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. అంతేకాదు ఓటుకు నోటు కేసులో డిటెక్టర్ టెస్ట్ కు కూడా రేవంత్ రెడ్డి సిద్ధం కావాలని పేర్కొన్నారు.  దీంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: