ఒకప్పుడు శాంతిభద్రతలు అంటే ఎలా ఉంటాయో తెలియని అక్కడి ప్రజలకు నేరాలను అరికట్టే శాంతిభద్రతలు మధ్య ఎంతో ధైర్యంగా బ్రతికే విధంగా భరోసా తీసుకొచ్చాడు యోగి ఆదిత్యనాథ్. పాలన విషయంలోనే కాదు అభివృద్ధి విషయంలో కూడా ఎన్నో రికార్డులు సృష్టించారు అని చెప్పాలి. యూపీఏ ప్రభుత్వ హయాంలో 51 కొత్త గవర్నమెంట్ కాలేజీలను కట్టించారు. 59 జిల్లాలో మెడికల్ కళాశాలలు కట్టించారు. 28 కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు, 4 రాష్ట్ర యూనివర్సిటీలు కూడా యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 9 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించారు. ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి కోసం ఇన్ని చేసిన యోగి ఆదిత్యనాథ్ కి రాబోయే ఎన్నికల్లో ఇవన్నీ కలిసి వస్తాయా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు ఎక్కువగా హావ భావాల మధ్య జరుగుతూ ఉంటాయి. చిన్నచిన్న హావభావాలను రెచ్చగొట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మరి ఈసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అభివృద్ధి గెలుస్తుందా లేదా హావభావాల రాజకీయాలు గెలుస్తాయా అన్నది చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి