దేశ వ్యాప్తంగా ఉల్లి ధరల నియంత్రణ కు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం.  మార్కెట్లో ఉల్లిపాయల ధరను నియంత్రణ  చేయడానికి లక్ష్యంగా చర్యలు తీసుకుంది వినియోగదారుల వ్యవహారాల శాఖ ( DCA ).  రాష్ట్రాలకు కేంద్రం వద్ద ఉన్న బఫర్ స్టాక్ నుండి ఉల్లిపాయలు కిలోకు రూ. 21 లకు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది.   దేశంలో పలు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో ధరలు అఖిల భారత సగటు కంటే ఎక్కువ ఉన్నారు.  12 అక్టోబర్, 2021 వరకు, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, గౌహతి, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, చండీగఢ్, కొచ్చి మరియు రాయపూర్ వంటి ప్రధాన మార్కెట్లకు మొత్తం 67,3567 MT విడుదల చేసింది.  

గ్రేడ్-బి ఉల్లిపాయలు (ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ కంటే తక్కువ ఉన్న స్టాక్స్ - FAQ ) మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ మరియు గుజ రాత్‌ లోని స్థానిక మార్కెట్లకు సరఫరా చేస్తోంంది.   రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు వినియోగదారులకు రి టైల్ అవుట్‌లెట్‌ల ద్వారా నేరుగా సరఫరా చేయడం ద్వారా ధరలను తగ్గించడానికి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.  

ప్రధాన నగరాల్లో SAFAL వంటి ప్రభుత్వ అవుట్ లెట్ల ద్వారాన రూ .26/kg కి అందిం చబ డింది అని స్పష్పం చేసింది వినియోగదారుల వ్యవహారాల శాఖ. ఉల్లి ధరల పెరుగుదలను మార్కెట్లో ఉల్లి ధరను నియంత్రించడానికి 2021-22లో, 2 ల క్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయ బఫర్‌ స్టాక్ ను సేకరించాలని లక్ష్యానికి గాను మొత్తం 2.08 లక్షల మెట్రిక్ టన్నుల  రబీ -2021 పంటకాలం నుండి ఏప్రి ల్ నుండి జూలై, 2021 వరకు సేకరించింది వినియోగదారుల వ్యవహారాల శాఖ. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలకు ఊరట కలుగ నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: