ఇక్కడ ఓ వ్యక్తి ఇలాంటిదే చేశాడు. సాధారణంగా దీపావళి పండుగ రోజు ఎవరైనా సరే ఇక టపాసులను కాల్చడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అంతేగాని దీపావళి రోజున మద్యం మాంసం లాంటివి ముట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు అన్న విషయం తెలిసిందే. అయితే అందరూ దీపావళి సంబరాల్లో మునిగి పోయిన సమయంలో ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఫుల్లుగా మద్యం తాగి వచ్చాడు.. ఇక ఆ తర్వాత వెళ్లి ఇంట్లో సైలెంట్ గా పడుకున్నాడు. కాని చివరలో ట్విస్ట్ ఏంటంటే అతను వెళ్ళింది సొంత ఇంట్లోకి కాదు పక్కింట్లోకి.
మద్యం తాగి వచ్చి పక్కింట్లోకి వెళ్లి రచ్చరచ్చ చేసిన ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది.
అయితే ఇలా మద్యం తాగి వేరే ఇంటికి వెళ్లిన వ్యక్తి ఎవరో కాదు ఏకంగా మాజీ ఎంపీ కావడం గమనార్హం. దీపావళి రోజున మద్యం మత్తులో ఏఐఏడీఎంకే మాజీ ఎంపీ గోపాలకృష్ణన్ పొరపాటున మద్యం మత్తులో TN- నగర్లోని ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే లోపలికి ప్రవేశించి రచ్చ రచ్చ చేసాడట. ఆయన తీరుపై ఆగ్రహించిన ఇంటి యజమాని గోపాలకృష్ణన్ పై దాడికి దిగాడు. ఇక ఆ తర్వాత గోపాలకృష్ణన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇక ఇంటి యజమానిని అరెస్టు చేసారు. ఇంట్లోకి వచ్చి అనుచితంగా ప్రవర్తించడం కారణంగానే దాడి చేశామని ఆయన ఎక్స్ ఎంపీ అన్న విషయం తెలియదు అంటే ఇంటి యజమాని తెలిపారు. తనపై ఎవరో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు అంటూ ex-mp పోలీసులకు ఫిర్యాదు చేయటం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి