కాస్త టాలెంటు ఉండి అదృష్టం కలిసి రావాలే కానీ ఏ వ్యాపారం లో అయినా సరే కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అన్న విషయాన్ని ఇప్పటివరకూ ఎంతోమంది నిరూపించారు. చదువులో వెనకబడి  తల్లిదండ్రుల చేత తిట్లు తిన్న వారు సైతం తమ టాలెంట్ తో ఏకంగా కోట్లకు అధిపతులు గా మారిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. చిన్నగా వ్యాపారాన్ని మొదలు పెట్టి ఏకంగా వందల కోట్లు సంపాదించిన వారు కూడా చాలామంది. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు అని చెప్పాలి. సాధారణంగా పాత ఇనుప సామాన్లు కొనే వారి గురించి మనకు తెలిసే ఉంటుంది.


 ఏదో చిన్నగా వ్యాపారం చేసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేసి కోట్లకు అధిపతి గా మారాడు. కర్ణాటకలో ఈ విషయం వెలుగులోకి రాగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం బెంగళూరులో శ్రీమంతుడైన రాజకీయ నాయకుల వరుసలో చేరిపోయాడు ఆ పాత సామాన్ల వ్యాపారి. ఇటీవల ఏకంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కర్ణాటక విధాన పరిషత్ ఎన్నికల్లో బరిలోకి దిగడం కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. అతని పేరు యూసుఫ్ షరీఫ్. అతనిని అందరూ కెజిఎఫ్ బాబు అని పిలుస్తూ ఉంటారు.


 ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగి నామినేషన్ వేసిన సదరు వ్యక్తి తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. 1643 కోట్ల స్థిరాస్తి 97 కోట్ల చరాస్తి ఉందని అతను వెల్లడించారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. కేజిఎఫ్ కేంద్రంగా చాలాకాలం  పాత సామాన్లు వ్యాపారం చేస్తూ వస్తున్నాడు యూసుఫ్ షరీఫ్. ఈ క్రమంలోనే కేజిఎఫ్ బాబుగా పేరు కూడా సంపాదించుకున్నాడు. కే జి ఎఫ్ లో ఉన్న పాత ట్యాంకులను కొనుగోలు చేసి వాటిని అమ్మడం చేసేవాడు. ఇలా చేయడం అతనికి బాగా కలిసి వచ్చింది. ఇలా వ్యాపారాన్ని విస్తరించడం మొదలు పెట్టాడు సదరు వ్యాపారి. ఇప్పుడు కోట్ల విలువ చేసే లక్సరీ కార్లు.. వాడుతూ ఎంతో లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నాడు.


మొత్తం 23 బ్యాంకు ఖాతాలున్న ఇతనికి  రూ.2.99 కోట్ల విలువైన 3 కార్లు, రూ.1.11 కోట్ల చేతి గడియారం, 4.5 కిలోల బంగారం, ఒక్కోటి రూ.లక్ష విలువ చేసే 4 మొబైల్ ఫోన్లు, మూడు చోట్ల రూ.48 కోట్ల విలువైన  భూములు, రూ.1593 కోట్ల విలువైన చేసే 26 స్థలాలు, రూ.3 కోట్ల  ఇల్లు ఆస్తుల్లో  ఉన్నాయి. రూ.58 కోట్ల రుణాలూ కూడా ఉండడం గమనార్హం. బాబుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య వద్ద రూ.77.15 లక్షలు, రెండో భార్య వద్ద రూ.30.37 లక్షలు, కుమార్తె వద్ద రూ.58.73 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయని తన నామినేషన్ లో పేర్కొన్నారు. బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ నుంచి రూ.2.01 కోట్ల విలువైన రోల్స్‌ రాయిస్‌ కారును  కొనుగోలు చేసి వార్తల్లోకి ఎక్కారు

మరింత సమాచారం తెలుసుకోండి: