తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ మధ్యకాలంలో ప్రజల్లోకి రాకపోవడం పార్టీ వ్యవహారాల మీద జోక్యం చేసుకోకపోవడం అదేవిధంగా అమరావతి ఉద్యమం విషయంలో పెద్దగా ఆసక్తి చూపించకపోవడం అనేది ఇబ్బందికరంగా మారిన అంశం. ఒకప్పుడు పార్లమెంట్ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు బలంగా తమ వాణిని వినిపించిన సరే ఆ తర్వాత మాత్రం సైలెంట్ గా ఉండటం కేంద్ర ప్రభుత్వం విషయంలో గానీ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో గానీ పార్లమెంటులో గట్టిగా మాట్లాడకపోవడం అనేది కాస్త ఇబ్బందికరంగా మారింది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అసలేమాత్రం కూడా మాట్లాడకపోవడం ఆయన ప్రజల్లోకి రాకపోవడం అదేవిధంగా పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఉత్సాహంగా లేకపోవడమనేది ఇబ్బందికరంగా మారింది. ఒకప్పుడు పార్టీ లో చాలా ఉత్సాహంగా కనబడిన నాయకుల్లో గల్లా జయదేవ్ ముందు వరుసలో ఉండగా ఇప్పుడు మాత్రం ఎక్కడున్నారు ఏంటి అనేది స్పష్టత రావడం లేదు. పార్టీలో కొంతమంది స్థానిక నాయకులతో కూడా ఈ మధ్య కాలంలో పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం కనీసం తన నియోజకవర్గానికి కూడా ఉత్సాహంగా వచ్చి అమరావతి ప్రాంత ప్రజలకు మద్దతు లేకపోవడం అనేది ఇబ్బందికరంగా మారింది.

రాజకీయంగా అమరావతి ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ వాడుకునే ప్రయత్నం చేయడం అదేవిధంగా అమరావతి ఉద్యమానికి సంబంధించి కీలకమైన పాదయాత్రలో బీజేపీ నాయకులు పాల్గొంటున్న సరే ఆయన మాత్రం బయటకు రాకపోవడం అనేది వైసీపీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. మరి భవిష్యత్తు విషయంలో ఏ విధంగా ముందుకు రాబోతున్నారు ఏంటి అనేది తెలియక పోయినా గల్లా జయదేవ్ సైలెంట్ గా ఉండటం పట్ల టీడీపీ గుంటూరు జిల్లా నాయకత్వం కూడా కాస్త ఇబ్బంది పడుతుందని చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.దీనిపై త్వరలో ఒక క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: