
ఏకంగా వందల కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. కానీ అంతలోనే అతనికి దురదృష్టం వెంటాడింది. చైనాలోని ఒక వ్యక్తి ట్రేడింగ్ ఖాతాలో అనుకోకుండా క్రిస్మస్ పండుగ రోజున 15.6 మిలియన్ డాలర్లు జమయ్యాయి. అంటే మన కరెన్సీలో దాదాపు 116 కోట్లు. దీంతో ఒక్కసారిగా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు గా మారిపోయాడు సదరు వ్యక్తి. అయితే అతను కోటీశ్వరుడు గా మారడానికి కారణం అతని పేరు చివరన లాంగ్ అని ఉండడమే అన్నది తర్వాత అర్థమైంది.
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. చైనాలో ఉన్న నైరుతి ప్రావిన్స్ లో లాంగ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అలవాటు.. ఈ క్రమంలోనే ఇటీవల ట్రేడింగ్ యాప్ చాంగ్ జియాంగ్ ద్వారా 940 డాలర్లు పెట్టుబడి పెట్టాడు. కానీ అతని ఖాతాలో ఏకంగా 15.6 మిలియన్ డాలర్లు జమ అయ్యాయి. దీంతో కోటీశ్వరుడి గా మారిపోయాను అంటూ అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. కానీ ఆ తర్వాత అతని దురదృష్టం వెంటాడింది. ఇదంతా యాప్ లో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ లోపం వల్ల జరిగిందని కస్టమర్ కేర్ అతనికి కాల్ చేసి తెలిపారు.. దీంతో అకౌంట్ లోకి వచ్చిన డబ్బులే కాదు అతడు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా తుడిచిపెట్టుకుపోయాయ్. దీంతో ఈ ఘటన గురించి తెలిసినవారు అయ్యో పాపం అతనికి ఇలా జరిగింది ఏంటి అంటూ అనుకుంటున్నారు.