అగ్రరాజ్యమైన అమెరికా లో ఒకే రోజు ఏకంగా ఆరు లక్షలకు పైగా కేసులు వెలుగులోకి రావడం సంచలనం గానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే.
దీంతో వైరస్ బారినపడి ఏ క్షణంలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అని అమెరికా ప్రజానీకం మొత్తం భయం గుప్పిట్లో బ్రతుకుతుంది. ప్రజలందరూ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చినప్పటికీ అక్కడ కేసుల్లో మాత్రం ఎక్కడా తేడా కనిపించడం లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం అమెరికాలో కేసులు పెరిగిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రపంచ దేశాలు సైతం ఎక్కడ తమ దేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందో అని భయాందోళనలో మునిగిపోతున్నాయి.
మొన్నటికి మొన్న ఒక్క నిమిషానికి ఒక కేసు నమోదయ్యింది అమెరికాలో. ఇటీవల 7 సెకండ్ కి ఒక కేసు నమోదు అయ్యింది. ఇక ఇప్పుడు ఏకంగా మూడు సెకన్ల కి అమెరికాలో ఒక కేసు నమోదు అవుతుంది అని ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న కేసులు శాస్త్రవేత్తలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో అమెరికాలో పరిస్థితులని ఆందోళనకరంగా మారిపోతున్నాయ్. మరి కొన్ని రోజులపాటు ఇలా కేసులు పెరిగితే ఇక అమెరికాలోమళ్లీ సంపూర్ణ లాక్ డౌన్ అమలులోకి వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి