రోడ్లు బాగుండక పోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నందున టీడీపీనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి మరమ్మతులకు నిధులు కేటాయించే వరకూ శ్రమదానంతోనే ప్రభుత్వంకు జవాబు చెప్పాలని భావిస్తోంది. దీంతో ఎక్కడిక్కడ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది. నిధుల లేమిని సాకుగా చూపి రాష్ట్రంలో చాలా చోట్ల రహదారుల పనులు ఆపి వేయడం తగదని, కనీసం మరమ్మతులకు కూడా చొరవ చూపకపోవడం సమంజసం కాదని పసుపు పార్టీ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ దశలో రహదారుల మరమ్మతులకు కొన్ని చోట్ల తెలుగు యువతే చొరవ చూపడంతో ముందున్ను కాలంలోనూ ఇదే విధంగా చేస్తామని చెప్పడంతో ప్రజలు కూడా ఈ తరహా వినూత్న నిరసనను స్వాగతిస్తున్నారు.
"గుంతల రోడ్లు ప్రయాణికుల పాట్లు మేల్కొందాం ప్రభుత్వాన్ని తరిమికొడదాం"
- ఇదే నినాదంతో టీడీపీ పనిచేస్తుంది
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా తెలుగు యువత వినూత్న నిరసనలకు పిలుపునిచ్చింది. రోడ్లు బాగోక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో వాటి మరమ్మతులకు ప్రాధాన్యం ఇచ్చింది.నిన్నటి వేళ విజయనగరం,
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి