తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా అని ముందు వెనకా ఆలోచించకుండా ముందడుగు వేస్తే మాత్రం చివరికి బొక్క బోర్లా పడి పోవడం ఖాయం అని ఇప్పటికే ఎంతోమంది విషయంలో నిజమైంది. ఎందుకంటే ఇటీవల కాలంలో డబ్బు ఆశతో ఉన్న ఎంతోమందిని టార్గెట్ గా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రమంలోనే డబ్బు ఆశ చూపిస్తూ భారీగా లాభాలు వస్తాయని మాయ మాటలు చెబుతూ చివరికి బురిడీ కొట్టించి ఖాతాలు ఖాళీ చేసిన ఘటనలు ఇప్పటికే ఎన్నో తెరమీదకు వచ్చాయి. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు ఇలాంటి నేరాలకు పాల్పడుతూ రెచ్చిపోతూనే ఉన్నారు.


 అందుకే అత్యాశకు పోయి ముందు వెనకా ఆలోచించకుండా ఏ పని చేసినా చివరికి ఉన్నది కూడా పోయి రోడ్డున పడే పరిస్థితి వస్తుందని అందుకే సైబర్ నేరగాళ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అంటూ అటు పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. తక్కువ సమయంలో లక్షలు సంపాదించాలి అనుకున్నా ఆ వ్యాపారి అత్యాశ చివరికి మోసగాళ్లకు ఆయుధంగా మారిపోయింది.. దీంతో ఇక మాయమాటలతో రంగంలోకి దిగిన మోసగాళ్లు వ్యాపారులను నమ్మించి లక్షలు కాజేశారూ. దీంతో అత్యాశకు పోయిన వ్యాపారులు తల  పట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.


 రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. షాద్ నగర్ కు చెందిన అమర్నాథ్రెడ్డి, జక్కల ఆంజనేయులు బంగారం వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇక ఈ వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నారు. కాని ఎక్కువ ఆదాయం తక్కువ సమయంలో వస్తే బాగుంటుంది అని కాస్త అత్యాశకు పోయారు ఇద్దరు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా చీరాలలో 31 లక్షలకే కిలో బంగారం వస్తుందని మధ్యవర్తులు ఇద్దరు వ్యాపారులను నమ్మించారు. ఈ క్రమంలోనే ఇక ఈ బంగారం తీసుకువెళ్లేందుకు విజయవాడకు వచ్చారు ఇద్దరు వ్యాపారులు. ఇక ఒక ముఠా ఈ వ్యాపారుల వద్దకు వచ్చి బంగారాన్ని చూపించగా అసలు బంగారమే అంటూ నిర్ధారించుకుని కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఇక ఈ బంగారం కొనుగోలు జరుగుతున్న  ప్లేస్ లోకి పోలీసుల వేషంలో వచ్చిన ముఠా సభ్యులు హడావుడి చేయడంతో వ్యాపారులు  నగదు అక్కడే వదిలి పెట్టి పారిపోయారు. దీంతో తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు వ్యాపారులు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: