ప్రస్తుతం మోదీ తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణ పర్యటనలో ఉన్నాడు. అందులో భాగంగా ఇంకాసేపట్లో ప్రధాని ముచ్చింతల్ లో ఉన్న ఆధ్యాత్మిక నగరంలో అడుగు పెట్టనున్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని మోదీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం విశేషం. ఇప్పటికే ఇక్రిశాట్ స్వర్ణ ఉత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన  అనంతరం స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ  ని ఆవిష్కరించనున్నారు. ఈ ఆవిష్కరణ కు కారకుడు అయిన శ్రీ రామానుజాచార్యులు గురించి ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాడు. మనకు తన ఆలోచనలు మరియు బోధనల ద్వారా ఎంతో స్ఫూర్తిని కలిగించిన మహానుభావుడు అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

ఇప్పుడు మనమంతా ఆయనకు నివాళి ఇచ్చే సమయం అని పేర్కొన్నారు. ఇది 216 అడుగులు కలిగిన పెద్ద శిల్పంగా ప్రఖ్యాతి గాంచినది. ఇది మన భారత జాతికి అంకితం కానుంది. ఈ కార్యక్రమానికి మన దేశం లో ఉన్న 5 వేల మంది రుత్విజులను పిలిపించారు. ఇప్పటికే వీరి యొక్క పూజలతో ఆ ప్రాంతం మొత్తం వైభవంగా ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమం మొత్తం రెండు భాగాలుగా జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఒక ప్రత్యేక ఘట్టాన్ని చేయనున్నారు. ప్రధాని చేపట్ట బోయే ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అవ్వాలని విష్వక్సేన ఇష్టి చేయనున్నారు.

ఇది ప్రముఖ స్వామీజీ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో జరగనుంది. ఇలా మోదీ ఇక్కడకు 5 గంటలకు వచ్చి తర్వాత 8 గంటలకు అన్ని పనులను పూర్తి చేసుకుని ఎయిర్ పోర్ట్ కు బయలు దేరి వెళతారు. ఇది ఈ రోజు మోదీ తెలంగాణ పర్యటన సారాంశం.  అయితే ఈ పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: