తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత ప్ర‌భుత్వం పుట్టిన పిల్ల‌ల కోసం న‌వ‌జాత శిశు సంర‌క్ష‌ణ కేంద్రాలు, పెద్ద వాళ్ల కోసం అడ‌ల్ట్ ఐసీయూలు, త‌ల్లుల కోసం మెట‌ర్న‌ల్ ఐసీయూల‌ను ప్ర‌త్యేకంగా ప్రారంభించిందన్నారు హరీష్ రావు. నేటి చిన్నారులే రేప‌టి భ‌విష్య‌త్ కాబ‌ట్టి వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొత్త‌గా పీడియాట్రిక్ ఐసీయూల‌ను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నాం. దీని కోసం మొత్తం రూ. 88 కోట్లు ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తున్న‌దన్నారు  హరీష్ రావు.  ఇక్క‌డి కిడ్నీ బాధితుల సౌక‌ర్యార్థం డ‌యాల‌సిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 45 ఉచిత డ‌యాల‌సిస్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగిందన్నారు  హరీష్ రావు.   తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవ‌లం మూడు డ‌యాల‌సిస్ కేంద్రాలు మాత్ర‌మే ఉంటే, వాటిని 45కు పెంచుకున్నాం. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఉండాల‌ని ఆ సంఖ్య‌ను 102కు పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటన చేశారు  హరీష్ రావు.  
 ఇప్ప‌టి వ‌ర‌కు 600 కోట్ల ఖ‌ర్చుతో 45ల‌క్ష‌ల సెష‌న్లు నిర్వ‌హించి, డ‌యాల‌సిస్ సేవ‌లు అందించామన్నారు  హరీష్ రావు.  సింగిల్ యూజ్డ్ ఫిల్ట‌ర్ సిస్టంను దేశంలోనే తొలిసారిగా మ‌నం ప్రారంభించుకున్నామని చెప్పారు  హరీష్ రావు.

 ఈ విష‌యంలో తెలంగాణ‌ను త‌మిళ‌నాడు మ‌న‌ల్ని ఆద‌ర్శంగా తీసుకున్న‌దన్నారు  హరీష్ రావు.  రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ‌గా తీర్చిదిద్దాల‌నే ల‌క్ష్యంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పెద్ద మొత్తంలో బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించారు. ప్ర‌జారోగ్యం కోసం రూ. 11,237 కోట్లు కేటాయించ‌డం జ‌రిగిందని వెల్లడించారు  హరీష్ రావు. బ‌డ్జెట్ కేటాయింపుల‌తో పాటు మొత్తం 80,039 పోస్టుల భ‌ర్తీలో 12,755 ఉద్యోగాలు ఆరోగ్య శాఖ‌లో భ‌ర్తీ చేసుకోబోతున్నామని పేర్కొన్నారు  హరీష్ రావు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ పురోగ‌మిస్తున్న‌ది. అందుకోసం తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న‌దన్నారు  హరీష్ రావు. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించింది. వైద్య సేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని వెల్లడించారు  హరీష్ రావు.  మ‌నం తాజాగా పెట్టుకున్న‌ బ‌డ్జెట్ ప్ర‌కారం, తెలంగాణ ప్ర‌భుత్వ త‌ల‌స‌రి వైద్య ఖ‌ర్చు రూ. 3,092కు చేరుకుందన్నారు  హరీష్ రావు.
-కేంద్రం నుంచి ఎలాంటి స‌హ‌కారం లేకున్నా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి నాంది ప‌లికారు. ఈ క్ర‌మంలో కేంద్రం నుంచి ఒక్క మెడిక‌ల్ కాలేజీ మంజూరు కాకున్నా, సొంత ఖ‌ర్చుల‌తో జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీ ఉండేలా ముఖ్య‌మంత్రి గారు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

TS