సాధారణంగా బంధువులు శ్రేయోభిలాషులు స్నేహితులు తమకు కావాల్సిన వారి పెళ్లికి వెళ్లారు అంటే చాలు ఏదో ఒక ప్రత్యేకమైన బహుమతి ని తీసుకు వెళ్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది మాత్రం కాస్త చిత్రవిచిత్రమైన బహుమతులు పెడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఒకప్పుడు అయితే చిన్న బాక్స్ లో ఏదో ఒక గిఫ్ట్ పెట్టి ఇక దాని చుట్టూ పెద్ద ప్యాకింగ్ చేసి ఇక దానిని స్టేజ్ మీద చింపేయాలి అంటూ పోటీ పెట్టేవారు. ఇటీవలి కాలంలో మాత్రం ప్రతి ఒక్కరూ ఇలా బహుమతులు ఇవ్వడం తో బాగా ట్రెండ్ ఫాలో అవుతున్నారు అని చెప్పాలి. మొన్నటికి మొన్న ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగిపోవడంతో ఏకంగా కొంతమంది ఉల్లిపాయలను పెళ్లిళ్లు వివిధ శుభకార్యాలలో బహుమతిగా ఇచ్చిన ఘటనలు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయాయి.



 ఇలా మార్కెట్లో ఏ ధరలు ఎక్కువగా ఉంటే అది బహుమతిగా ఇవ్వడం లాంటివి చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు వేటి ధరలు ఎక్కువగా ఉన్నాయి అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్పేది పెట్రోల్ డీజిల్ ధరలు అనే. అయితే పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఎవరైనా పెట్రోల్ డీజిల్ బహుమతిగా ఇవ్వరు కదా అని అంటారా.. అలా అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇక్కడ మాత్రం నిజంగానే పెట్రోల్ డీజిల్ బహుమతిగా ఇచ్చారు. ఇలా పెళ్లి లో పెట్రోల్ డీజిల్ బహుమతిగా ఇచ్చిన ఒక ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఇది చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి.



 తమిళనాడులో ఇక ఈ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చిన నూతన వధూవరులకు స్నేహితులు గిఫ్టుగా పెట్రోల్ డీజిల్ ఇవ్వడం కాస్త వైరల్ గా మారిపోయింది. తమిళనాడులో లీటర్ పెట్రోల్ ధర 110.50 రూపాయలు.. డీజిల్ ధర 100. 94 రూపాయలు ఉంది. ఈ క్రమంలోనే వధూవరులకు వారి ఫ్రెండ్స్ బాటిళ్లలో పెట్రోల్ డీజిల్ నింపుకొని వచ్చి వేదికపై అందజేసి ఫోటోకి ఫోజులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో క్లాస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ట్రెండ్ ఫాలో అవుతున్నారు మేమేం తక్కువ అనుకున్నారో ఏమో అందుకే పెట్రోల్ డీజిల్ బహుమతిగా ఇచ్చారు అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: