సోషల్ మీడియాలో కాస్త గట్టిగానే సీఎం జగన్ ని టార్గెట్ చేసింది జగసేన. పదే పదే దత్తపుత్రుడు అంటూ కాస్త వ్యంగ్యంగా మాట్లుడుతున్న వైసీపీ నాయకులకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని ప్లాన్ చేశారు జనసేనాని పవన్ కల్యామ్. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈరోజునుంచి సోషల్ మీడియాలో సీఎం పరువు తీసేందుకు ప్రణాళిక రచించారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే డిజిటల్ క్యాంపెయిన్ ని పవన్ కల్యాణే నేరుగా మొదలు పెట్టారు. సెటైరికల్ ట్వీట్లు పెట్టారు. సీఎం హెలికాప్టర్లో వెళ్తున్నట్టు, కింద రోడ్లపై వెళ్లే జనాల దుస్థితి ఆయనకు పట్టనట్టు ఉన్న కార్టూన్లను పెట్టారు.

ఈరోజు నుంచి జనసేన డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెట్టింది. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తోంది. ఏపీలో ఎక్కడెక్కడ రోడ్లు బాగోలేవో సెలక్ట్ చేసుకుని వాటి ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తోంది. పవన్ కల్యాణ్ మొదట ఈ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. ఉదయం 8 గంటలకు పవన్ కల్యాణ్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వేశారు. రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్డు పరిస్థితిని తెలిపేలా ట్వీట్ వేశారు పవన్ కల్యాణ్. కారులో వెళ్తూ ఆ వీడియో తీసినట్టు తెలుస్తోంది. ఆ వీడియోను పవన్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. దాన్ని జనసేన ట్విట్టర్ నుంచి రీట్వీట్ చేశారు. ఈ రోజునుంచి జనసైనికులంతా ఇలా ఎక్కడెక్కడ ఏయే రోడ్లు ఎలా ఉన్నాయో చూపెడుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అంతే కాదు వాటికి #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్ జతచేస్తారు. దీంతో ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వస్తుంది. ఈ సమస్య చర్చకు వస్తుంది.



ఇటీవల ఏపీలో రోడ్ల పరిస్థితి కొంతలో కొంత మేలు అని చెప్పుకోవాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు రెండేళ్లుగా రోడ్ల మరమ్మతులను పట్టించుకోలేదు. గత టీడీపీ ప్రభుత్వం రోడ్లు అధ్వాన్నంగా వేసిందని చెప్పారే కానీ, ప్రజలు పడుతున్న అవస్థకు ఎక్కడా సమాధానం చేప్పలేదు. ఇటీవల కాస్తో కూస్తో పనులు మొదలయ్యాయి. అయినా కూడా అక్కడక్కడ అధ్వాన్నమైన రోడ్లు ప్రజలకు నరకం చూపెడుతున్నాయి. దీనిపై జనసేన మొదలు పెట్టిన డిజిటల్ క్యాంపెయిన్ తో అయినా పరిస్థితి మూరుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: