ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక విషయమై నోరెత్తాలంటే వణికిపోతున్నారు. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే తెలంగాణాను ఊపేస్తున్న ఎంఎల్ఏల కొనుగోళ్ళ బేరసారాల ఘటన. నలుగురు టీఆర్ఎస్ ఎంఎల్ఏలను కొనేందుకు బీజేపీ బేరాలు కుదుర్చుకున్నట్లు ఒక్కసారిగా గోల మొదలైంది. మోయినాబాద్ ప్రాంతంలోని ఒక ఫాంహౌస్ లో నలుగురు ఎంఎల్ఏలుండగా పోలీసులు దాడిచేశారు.





అలాగే నందకుమార్, సింహయాజులుతో పాటు మరోవ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరే నిజంగానే ఎంఎల్ఏల కొనుగోళ్ళకు బేరాలు జరిగాయా లేదా అన్న విషయంపై ఇఫ్పట్లో వాస్తవాలు బయపడేట్లులేదు. ఎందుకంటే ఘటనపైన రెండువైపుల వాదనలు వినబడుతున్నాయి. రెండు వైపుల వినబడుతున్న వాదనలు కరెక్టేకదా అనిపిస్తున్నాయి.





సరే ఈ గోల ఇప్పట్లో తెమిలేది కాదుకానీ ఇక్కడే చంద్రబాబు, పవన్ వైఖరి ఏమిటనేది ఆసక్తిగా మారింది. వీళ్ళద్దరు ప్రపంచంలోని అన్నీ విషయాలమీద తమ అమూల్యమైన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మీడియాలోను ట్విట్టర్ ద్వారా జనాలకు అందిస్తుంటారు. మరింతటి కీలకమైన ఘటనపై ఎందుకు నోరెత్తటంలేదు. ఎందుకంటే నోరెత్తితే తమకు ఎక్కడ చుట్టుకుంటుందో అనే భయమే కారణమని తెలుస్తోంది. ఒకవైపు టీఆర్ఎస్ మరోవైపు బీజేపీ ఘటనలో ఇన్వాల్వ్ అయిన కారణంగానే వీళ్ళు నోరెత్తటానికి భయపడుతున్నారు.





టీఆర్ఎస్ ఎంఎల్ఏలను కొనుగోలు చేయటం తప్పంటే బీజేపీ వాయించేస్తుంది. ఇదే సమయంలో అసలు కొనుగోళ్ళే జరగలేదు బీజేపీ నిప్పులాంటి పార్టీ అనంటే కేసీయార్ చెడుగుడు ఆడేస్తారు. కేసీయార్ ను తప్పుపట్టి  మళ్ళీ హైదరాబాద్ లో ఉండగలరా ? ఛాన్సే లేదు. అందుకనే జరిగిన ఘటనేదో తెలంగాణాలో కాదన్నట్లుగా ఇద్దరు వ్యవహరిస్తున్నారు. ఏమి మాట్లాడితే ఎవరితో ఏమి ఇబ్బందులు వస్తాయో తెలీదు. ఏదో ఒకటి మాట్లాడి తామెందుకు ఇరుక్కోవాలన్న ఆలోచనతోనే ఇద్దరు నోరిప్పటంలేదు. వీళ్ళే కాదు ఎల్లోమీడియా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఘటనను ఘటనగా మాత్రమే ప్రజెంట్ చేసింది. ఇదే ఘటన ఏపీలో జరగకపోవటం నిజంగా జగన్మోహన్ రెడ్డి అదృష్టమనే చెప్పాలి. లేకపోతే ఈ పాటికి జగన్ పనిగోవిందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: