వైసీపీలో ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి వచ్చే ఎన్నికల్లో పార్టీ మారుతారు అని రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే మారుతున్నారు అన్నదానికంటే.. పార్టీ నుండి మారేలా సీఎం జగన్ ఆనంకు చెక్ పెట్టాడని పొలిటికల్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇందుకు కారణం అందరికీ తెలిసిందే.. మంత్రి గా నియమించలేదన్న అక్కసును అప్పుడప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి మీడియా మెందు వెళ్లగక్కుతున్నారు. తాజాగా కూడా వచ్చే ఎన్నికల సమయంలో ఏ మొహం పెట్టుకుని మరియు ఈ నాలుగు సంవత్సరాలు ఏమి చేశామని ఓట్లు అడగడానికి వెళ్ళాలి అంటూ జగన్ పై విమర్శలు చేశాడు.

దీనితో వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటును నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఇవ్వనున్నారని దాదాపుగా ఖాయం అయిపోయింది. ఇక ఆనం వైసీపీ నుండి సర్దుకోవడమే తరువాయి.. ఆనం కున్న రాజకీయ అనుభవానికి ఆయన టీడీపీలోకి వెళతాడు అని తెలుస్తోంది. ఇక టీడీపీ నుండి వినిపిస్తున్న ప్రకారం అఞ్ఞమకు ఆత్మకూరు ఎమ్మెల్యే సీటును రిజర్వు చేసి ఉంచారట. కాగా ఆత్మకూరు నియోజకవర్గంలో 2019 లో మేకపాటి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలిచి మంత్రిగా చేస్తున్న సమయంలో సడెన్ హార్ట్ అటాక్ రావడంతో  మరణించాడు. అలా ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు.

ప్రస్తుతం ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు, తెలుస్తున్న సమాచారం ప్రకారం బాగానే చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వచ్చే ఎన్నికల్లో మేకపాటి ఫ్యామిలీకి ఆనం ఫ్యామిలీతో పోటీ పడక తప్పడం లేదు. నెల్లూరు జిల్లా రాజకీయాలను ఒకప్పుడు శాసించిన చరిత్ర ఆనం వారి ఫ్యామిలీది. ఇక మేకపాటి ఫ్యామిలీ కి సైతం మంచి పేరుంది, మేకపాటి రాజమోహన్ రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ తరపున నెల్లూరు ఎంపీగా గెలిచాడు. రానున్న ఎన్నికల్లో వీరివురి ఫ్యామిలీ ల మధ్యన పొలిటికల్ వార్ ఏ విధంగా ఉండనుంది అన్నది తెలియాల్సి ఉంది.      


మరింత సమాచారం తెలుసుకోండి: