స్పీకర్ తమ్మినేని సీతారం కోరిక ఇప్పుడైనా నెరవేరుతుందా ? ఇపుడీ అశంపైనే పార్టీలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే మంత్రిగా బాధ్యతలు తీసుకోవాలన్నది తమ్మినేని చిరకాల కోరిక. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన్ను స్పీకర్ గా ఎంపిక చేశారు. 2019లో అధికారంలోకి వచ్చినపుడే తనను స్పీకర్ గా ఎంపిక చేశారని తెలిసి సీతారామ్ మంత్రిపదవి కోసం ప్రయత్నించారు. అయితే ఎందుకనో జగన్ అప్పట్లో తమ్మినేని కోరికను కాదన్నారు.





చేసేదిలేక స్పీకర్ పదవితో సరిపెట్టుకున్నారు. తర్వాత జరగిన ప్రక్షాళనలో అయినా తనకు మంత్రిపదవి వస్తుందని ఆశించారు. అయితే అనుకున్నట్లు మంత్రిపదవి దొరకలేదు. ఇపుడు మళ్ళీ మూడోసారి ప్రక్షాళన అంటున్నారు. ఇదే చివరి అవకాశమని సీతారామ్ కు అర్ధమైంది. వచ్చేఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందో లేదో ఎవరు చెప్పలేరు. కాకపోతే రెండోసారి కూడా వైసీపీనే మంచి మెజారిటితో గెలుస్తుందని జగన్ బాగా నమ్మకంతో ఉన్నారు. అందుకనే వైనాట్ 175 అనే నినాదాన్ని ఇస్తున్నది.





మరో వారంరోజుల్లో కొందరు మంత్రులకు ఉధ్వాసన తప్పదని వాళ్ళ స్ధానాల్లో కొందరిని తీసుకుంటారనే ప్రచారం అందరికీ తెలిసిందే. స్ధూలంగా ఐదుగురికి అవకాశం ఉంటుందని టాక్ నడుస్తోంది.  మంత్రివర్గంలో నుండి బయటకు వెళ్ళిపోయే వారికి జగన్ ఇప్పటికే సమాచారం ఇచ్చారట. ఇందులో భాగంగానే మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారమే రెండుసార్లు భేటీ అయ్యారని సమాచారం. మరో ముగ్గురిని శనివారం క్యాంపాఫీసుకు రమ్మని జగన్ చెప్పారట.





ఇదంతా బాగానే ఉంది అయితే మధ్యలో స్పీకర్ ఎందుకని జగన్ తో భేటీ అయ్యారు ? అన్నదే అర్ధంకావటంలేదు. శుక్రవారం జగన్ తో స్పీకర్ దాదాపు అర్ధగంట సమావేశమయ్యారు. స్పీకర్ పదవినుండి తప్పించమని మంత్రివర్గంలోకి తీసుకోవాలని తమ్మినేని రిక్వెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంకు చెందిన మంత్రి సీదిరిని తప్పిస్తే ఇదే జిల్లాకు చెందిన తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని జగన్ను  తమ్మినేని అడిగినట్లు పార్టీవర్గాల చెబుతున్నాయి. మరిప్పుడైనా తమ్మినేని కోరికను జగన్ తీరుస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: