
కానీ ఏపీ సీఎం మాత్రం ఇలాంటి ఎన్ని పార్టీలు కలిసొచ్చినా కూడా కేవలం తాను నమ్ముకున్నది ప్రజలని అటు దేవుణ్ణి అంటూ సింగిలిగా పోటీ చేస్తున్నానంటూ ఈసారి 175 సీట్లకు 175 గెలవాలని ఆలోచనతో ముందుకు వెళుతున్నారు.. ఈ నెలలో వైసీపీ మేనిఫెస్టో కూడా అనంతపూర్ జిల్లాలో విడుదల చేయబోతున్నారు సీఎం జగన్.. ఈ మ్యానిఫెస్టో వల్ల మరింత మైలేజ్ పెరిగే అవకాశం ఉన్నది..ఇప్పటివరకు టిడిపి పార్టీ కూడా కేవలం అక్కడక్కడ కొన్ని పార్టీలు ప్రకటించిన పథకాలను వైసీపీ పార్టీలోని కొన్ని పథకాలను కాపీ కొడుతూ లోకేష్ నిన్నటి రోజున 6 గ్యారంటీ పథకాలు అంటూ విడుదల చేశారు.
అంతేకాకుండా ప్రజలు కూడా టిడిపి పార్టీని అసలు నమ్మడం లేదు గతంలో చేసినటువంటి మోసాలు వల్ల కూడా ప్రజలు చంద్రబాబు మీటింగ్ పెట్టిన పెద్దగా జనాలు కూడా కనిపించడం లేదనీ రాజకీయ నాయకులు తెలియజేస్తున్నారు. కేవలం ఒక్క జగన్ ని ఓడించడానికి ఇంతమంది ఏకమయ్యారని తెలిసి వైసీపీ అభిమానులు సైతం జగన్ గెలుపు కే సంకేతం అంటూ గెలుపు కూడా ఖాయమని అందుకే ఇలా అన్ని పార్టీలు ఏకమై ఏవేవో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.ఇన్ని పార్టీలు ఏకమైనప్పటికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో గెలిచి ఒక కొత్త చరిత్ర సృష్టిస్తారని భావిస్తున్నారు.. ప్రజలు కూడా ఎవరిని ఎంచుకోవాలో చాలా క్లారిటీగా ఉన్నారని చెప్పవచ్చు.