ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉంది. నిన్నటి రోజున అటు టిడిపి జనసేన పార్టీ మధ్య సీట్ల విషయాలను సైతం ప్రకటించారు.. అధికార పార్టీ వైసీపీ వ్యూహాలు సైతం అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నాయి.. విడతలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్న సీఎం జగన్ తాజాగా నిన్నటి రోజున టిడిపి జనసేన ఉమ్మడి జాబితాను 118 స్థానాలను ప్రకటించారు.. అయితే ఈ స్థానంలో వైసీపీని వీడి చంద్రబాబుకు జై కొట్టిన వైసిపి ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఒక్కసారిగా షాక్కులు తగిలాయి..


ఇప్పటివరకు ఎంతగానో ఎదురు చూసిన టిడిపి జనసేన జాబితా విడుదల అయింది. ఇందులో కూడా కొంతమంది నేతలు చాలా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.. వైసీపీ పార్టీ నుంచి వెళ్లిన వారిలో ఉండవల్లి శ్రీదేవి, అనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ వంటి వారికి టిడిపి షాక్ ఇచ్చింది.. వీరి స్థానాల పేర్లు కొత్త వారిని కూడా ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో టిడిపికి వీరు ఓటు వేశారని.. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అనం రామనారాయణ రెడ్డి వంటి వారిలను వైసీపీ పార్టీ సస్పెండ్ చేసింది.


దీంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలు టిడిపి వైపుగా వెళ్లి పార్టీలో చేరారు..అయితే తమకే సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరు.. టిడిపి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. వీరందరూ కూడా చంద్రబాబును మాటలతో ప్రసన్నం చేసినప్పటికీ తాజాగా విడుదలైన టిడిపి జనసేన జాబితాలో వీరిలో చంద్రబాబు ముగ్గురికి మొండి చేయి చూపించారు. శ్రీదేవి స్థానంలో శ్రావణ్ కుమార్ పేరును.. మేకపాటి చంద్రశేఖర్ ప్లేసులో కొత్త అభ్యర్థిని కూడా ప్రకటించారు.దీంతో చంద్రబాబు వీరందరినీ నమ్మించి మోసం చేశారని మరొకసారి ప్రూఫ్ చేసుకున్నారు.. ఆదరించిన పార్టీని మోసం చేసినందుకు వీరికి కూడా తగిన శాస్తి జరిగిందంటూ పలువురు నాయకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: