YS వివేకా రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి తాజాగా ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.తన తండ్రి  కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని నర్రెడ్డి సునీతారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఐదేళ్ల నుంచి పోరాడుతున్నా కూడా అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రజా కోర్టులో ఖచ్చితంగా తీర్పు కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఇలాంటి హత్య కేసుల్లో ఎవరు చేశారనేది 4-5 రోజుల్లో తెలిసిపోతుందని సునీత తెలిపారు. వివేకా రెడ్డి కేసులో ఐదేళ్లయినా ఇంకా ఎందుకు తెలియడం లేదు? అని ఆమె ప్రశ్నించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తండ్రి పోటీ చేశారని ఆమె గుర్తు చేశారు. అయితే సొంతవాళ్లే మోసం చేయడంతో ఓడిపోయారన్నారు. అయినా కూడా అసలు నిరాశ చెందకుండా.. రాజకీయాల్లో మరింత చురుగ్గా వ్యవహరించారన్నారు. ఎంత ప్రయత్నించినా కూడా ఆయన్ను అణగదొక్కలేకపోతున్నామనే భయం ప్రత్యర్థుల్లో ఎక్కువైందన్నారు. అప్పట్లో తమకు ఇదంతా కూడా అసలు అర్థం కాలేదన్నారు.సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తికావట్లేదని ప్రశ్నించారు. ఇలాంటి హత్యా రాజకీయాలు ఉండకూడదన్నారు.తన తండ్రిని గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసని సునీత సందేహం వ్యక్తం చేశారు. ఆ విషయం ఇప్పుడు తేలాలన్నారు.


తన తండ్రి వివేకా హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి ఇంకా వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ప్రమేయం ఉందని సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. వాళ్లిద్దరినీ జగన్‌ రక్షిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో అవినాష్‌ రెడ్డికి ఖచ్చితంగా శిక్ష పడాలి.. పడుతుందన్నారు. వంచన, మోసానికి పాల్పడిన తన అన్న పార్టీ వైసీపీకి ఓటేయొద్దని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.ఇక ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలేనన్నారు.ఇచ్చిన మాట మీద నిలబడతా.. విశ్వసనీయత అంటూ జగన్‌ మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్నారని సునీత ఎద్దేవా చేశారు. కానీ ఈ చెల్లికి ఇచ్చిన మాటను ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలని సునీత కోరారు. సొంత వాళ్లను అంత సులువుగా అనుమానించలేమని.. అందుకే జగన్‌ ను కలిసినప్పుడు తనకు ఆయనపై అనుమానం రాలేదని అన్నారు.తన తండ్రి హత్య కేసులో మొత్తం 8 మంది పేర్లు బయటకు వచ్చాయని.. ఇంకా రాని పేర్లు కూడా చాలా ఉన్నాయన్నారు.


జగన్‌ పాత్రపైనా ఖచ్చితంగా విచారణ చేయాలని కోరారు. నిర్దోషి అయితే వదిలేయాలని.. తప్పు చేస్తే మాత్రం అసలు తప్పించుకోకూడదన్నారు.హత్య చేసిన నిందితులు ఒక్కసారి బెయిల్‌ పై బయటకొస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేయరా? అని సునీత ప్రశ్నించారు. జగనన్న కేసుల వల్లే తన తండ్రి హత్య కేసును సాగదీస్తున్నారని అన్నారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో తనకు అసలు తెలియదన్నారు. తాను కూడా ప్రజల్లోకి వెళ్తానని సునీత సెన్సేషనల్ కామెంట్స్‌ చేశారు. అయితే ఎలా వెళ్లాలనేదానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదన్నారు. అలాగే అనుమానితులుగానే తనను, తన భర్తను అధికారులు ప్రశ్నించారని సునీత చెప్పారు. ప్రభుత్వం నిందితుల వెనుక ఉంది కాబట్టే తమపై కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. మాలాగే అందరినీ విచారించాలని సునీత డిమాండ్‌ చేశారు. విచారణ త్వరగా పూర్తిచేసి దోషులను ఖచ్చితంగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: