ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది..పొత్తులో భాగంగా సీట్లు దక్కని నాయకులు అసమ్మతి రాగాన్ని ఆలపిస్తున్నారు.జిల్లాలో టీడీపీ, జనసేనల మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి.. పశ్చిమ ప్రకాశంలో కీలకమైన గిద్దలూరు నియోజకవర్గంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించడం పట్ల జనసేన నాయకులు మరియు కార్యకర్తలు మండిపడుతున్నారు. మొదటి నుంచి ఈ సీటును జనసేనకు ఇస్తామంటూ ప్రచారం చేసి చివరికి తెలుగుదేశం పార్టీకి కేటాయించడం వెనక దుష్ట శక్తుల కుట్ర ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమంచి స్వాములును గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. అయితే టీడీపీ, జనసేన పొత్తుల తరువాత కూడా కఆయనే ఇంచార్జ్ గా వున్నారు.. చివరికి గిద్దలూరు సీటు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో జనసేన నాయకులు మోసపోయినట్లు గ్రహించారు. నమ్మించి మోసం చేశారని ఆగ్రహం చెందిన ఆమంచి స్వాములు జనసేన పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామాలు జరుగుతుండగానే టీడీపీ అభ్యర్థి అశోక్‌ రెడ్డి జనసేనలో చిచ్చు పెట్టారు. రెండు గ్రూపులను సృష్టించారు. జనసేనలో కాసుల పాండు, బెల్లంకొండ సాయిబాబు గ్రూపులు ఏర్పడ్డాయని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆమంచి స్వాములు ఆదివారం రాత్రి కంభంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో తెలుగుదేశం నాయకత్వంపై ఫైర్‌ కావడం సంచలనం సృష్టించింది. ఓడిపోయే సీట్లను జనసేనకు కట్టబెడుతున్నారని ఆయన చేసిన విమర్శలు పెద్ద దుమారం లేపాయి. జిల్లా నుంచి కనీసం ఒక్క సీటైనా జనసేనకు ఎందుకు కేటాయించలేదన్న ఆయన ప్రశ్నకు సమాధానం లేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, పొత్తు విషయంలో పునరాలోచించుకోవాలని పార్టీ నాయకుడు పవన్‌ కళ్యాణ్‌కు ఆయన సూచించడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆమంచి స్వాములు రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్వాములు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: