కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉంటాయని ఒకటాక్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. అయితే ఇతర పార్టీలో ఉండవా అంటే.. ఇతర పార్టీల్లో కూడా ఇలాంటి గ్రూపు తగాదాలు, వర్గ రాజకీయాలు ఉన్నప్పటికీ.. అటు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోలోపలే ఉండాల్సిన గ్రూపు తగాదాలు ఏకంగా మీడియా ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. నేతలందరూ కూడా బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్ళగక్కడం లాంటివి చేస్తూ ఉంటారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇదే జరిగింది. ఏకంగా టిడిపి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి.


 ఇక రేవంత్ రాక అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు ఎవరికి కూడా నచ్చలేదు  అయినప్పటికీ ఇక అటు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అయితే తెలంగాణలో కనీసం కాంగ్రెస్ గెలుస్తుంది అని నమ్మకం కూడా ఎవరికీ లేదు. అలాంటి సమయంలో ఏకంగా కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టి మళ్లీ కాంగ్రెస్ ను ఫామ్ లోకి తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. ఈ సమయంలో సీనియర్ నేతల నుండి ఎన్నో చిత్కారాలు ఎదుర్కొన్నాడు. డబ్బులు పెట్టి పదవి కొన్నాడంటూ కాంగ్రెస్ సీనియర్ లందరూ కూడా దుమ్మెత్తి పోశారు. ఇక ఎంతో మంది నేతలు అతనికి మద్దతు ప్రకటించబోము అంటూ.. కనీసం పార్టీ ప్రచారంలో కూడా పాల్గొనలేదు. ఇలా రేవంత్ రెడ్డి పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒకరు.


 రేవంత్ నిన్న మొన్న వచ్చిన బచ్చ.. నేనే కాంగ్రెస్ లో సీనియర్.. ఇక సీఎం కుర్చి దక్కేది నాకే అంటూ ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. ఇక రేవంత్ పై తన అసంతృప్తిని కూడా ఎన్నోసార్లు వెళ్లగక్కారు. అయితే గతంలో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి రేవంత్ ని విమర్శిస్తుంటే.. ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిన వెంకటరెడ్డి.. విదేశాలకు వెళ్లి తన తమ్ముడిని గెలిపించాలంటు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఇలాంటివన్నీ దాటుకుని చివరికి రేవంత్ సీఎం అయ్యాడు. ఇలా తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పి.. రేవంత్కు సీఎం పదవి పదవి దక్కితే ఊరుకునేది లేదు అంటూ చెప్పిన అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక ఇప్పుడు మరో పదేళ్లపాటు సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడని చెబుతున్నాడు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షెందేలు అంటే తిరుగుబాటుదారులు ఎవరూ లేరు అంటూ చెబుతున్నాడు. దీంతో ఇంత త్వరగా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనసు మారడానికి కారణం ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. నిజంగానే ఆయన మారారా లేదంటే రేవంతును దెబ్బ కొట్టేందుకు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tg