జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంత బిజీబిజీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2019 ఎన్నికల సమయంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న పవన్ కళ్యాణ్.. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. టిడిపి బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా 21 అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలలో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు అన్న విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఒకవైపు తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే ఇంకోవైపు తన పార్టీ అభ్యర్థులు అందరిని కూడా గెలిపించుకోవడం కోసం జనసేన పోటీ చేస్తున్న అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో మునికి తేలుతూ ఉన్నారు. ఇంకోవైపు ఇక టిడిపి బిజెపి అభ్యర్థులకు మద్దతుగా కూడా ప్రచార నిర్వహిస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ బిజీబిజీగా ఉన్న సమయంలో ఇక ఇప్పుడు ఏకంగా తమిళనాడులో కూడా జనసేనాని ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు.


 మొన్నటి వరకు తెలంగాణ గవర్నర్ గా కొనసాగిన తమిళసై సౌందర్యరాజన్ ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను తనకు మద్దతుగా ప్రచార నిర్వహించమని స్పెషల్ రిక్వెస్ట్ చేయగా చెన్నై సౌత్ లో ఇక తమిళ సై సౌందర్య రాజన్ కి మద్దతుగా ప్రచార చేయడానికి రెడీ అయ్యారట పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్ సైతం బిజెపి అభ్యర్థి అన్నామలై తరఫున కోయంబత్తూరులో ప్రచారం చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై రాజకీయ విశ్లేషకులు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. పూర్తిగా ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేసి ఇక్కడ అభ్యర్థులను గెలిపించుకోవాల్సింది పోయి.. ఈ టైం సొంత ప్రచారాన్ని వదిలేసి ఇతరులకు మద్దతుగా ప్రచారానికి వెళ్లడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: