ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపద్యంలో తెలంగాణలో ఎక్కడ చుసిన ఎన్నికల హడావిడి కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రధాని పార్టీలన్నీ కూడా ప్రస్తుతం గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. మరి ముఖ్యంగా బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్ అని చెప్పాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి భంగపాటు ఎదురయింది. హ్యాట్రీక్ కొడతాము అనుకున్న ఆ పార్టీకి చివరికి ప్రతిపక్ష హోదాని మాత్రమే అప్పజెప్పారు తెలంగాణ ప్రజల. ఈ క్రమంలోనే ఇక తెలంగాణలో ఎప్పటికి అధికారంలోకి రాదు అనుకున్న కాంగ్రెస్ అధికారం చేపట్టింది.


 దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని అటు కాంగ్రెస్ భావిస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బిఆర్ఎస్ కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయిన మెజారిటీ స్థానాలలో  విజయం సాధించాలని అనుకుంటుంది. ఇక బిజెపి పార్టీ కూడా మోడీ మేనియాతో ఎక్కువ స్థానాలలోనే తమకు విజయం వరిస్తుంది అని ధీమాతో ఉంది. అయితే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లో గెలుపు ఎవరిని వలిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోతుంది. అయితే పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడల్లా.. ఇక్కడ ఓటర్లు అనూహ్యమైన ఫలితాలకు కారణం అవుతూ ఉంటారు అని చెప్పాలి.


 2009లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది అయితే ఇప్పటివరకు ఇక్కడ మూడుసార్లు ఎన్నికలు జరిగాయ్. ఇక మూడుసార్లు కూడా కొత్త అభ్యర్థులే ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఒకసారి గెలిచినోళ్లు మరోసారి గెలిచిన దాఖలాలు అస్సలు లేవు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి ఇక్కడ నుంచి ఎంపిగా గెలిచారు. కానీ ఆయన 2014లో ఓడిపోయారు. ఇక 2014 పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన బూర నర్సయ్య గౌడ్ 2019లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతిలో ఓటమిపాలు అయ్యారు. ఇక ఎప్పుడూ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్, బిఆర్ఎస్ నుంచి క్యామా మల్లేష్, బిజెపి నుంచి బూర నర్సయ్య గౌడ్, సిపిఎం నుంచి జహంగీర్ పోటీలో ఉన్నారూ. మరి ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: