ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లారు.. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా లండన్ ఇతరత్న ప్రాంతాలకు వెళ్లారు.. చంద్రబాబు కూడా అమెరికా యాత్రకు వెళ్లారు. కానీ చంద్రబాబుకు నిబంధనలు విషయంలో పోలీసులు చూడకుండా వదిలేస్తున్నట్లుగా అనుమానాలు మొదలవుతున్నాయి.. చంద్రబాబు నాయుడు గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో, ఫైబర్ నెట్, ఆన్ సైడ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు , ఇతరత్రా కుంభకోణాలలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు సిఐడి కేసు కూడా నమోదు చేసింది.


అంతేకాకుండా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏకంగా 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ఉన్నారు.. ప్రస్తుతం బెయిల్  మీద ఉంటూ తిరుగుతున్నారు. అలాగే ఫైబర్ నెట్ కుంభకోణం లో కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ చేశారు చంద్రబాబు.. హైకోర్టు వీటిని తిరస్కరించింది. చంద్రబాబు మాత్రం అనుమతులు తీసుకోకుండా అన్ని ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను ఆపినట్లుగా సమాచారం. దీంతో సిఐడి అధికారులతో ఎన్నోసార్లు చర్చించిన చంద్రబాబు నాయుడు చిట్టచివరికి అధికారులు విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు.


అయితే ఇక్కడ తమాషా ఏమిటంటే సిఐడి అనుమతి లేకుండానే చంద్రబాబు విదేశాలకు వెళ్లకూడదనే విషయం వాస్తవమే.. పర్యటనను మొత్తం ప్లాన్ చేసుకొని విమానాశ్రమం దాకా వెళ్ళిపోయి.. అక్కడ నుంచి సిఐడి అధికారులకు ఫోన్ చేయించి అనుమతులు తెచ్చుకున్నారు. అయితే ఒకవేళ జగన్ ఇలా చేసి ఉంటే మాత్రం ఎల్లో మీడియా, పత్రికలు  టిడిపి నేతలు చంద్రబాబు కూడా నానా హంగామా చేసేవారు.. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న ఈ పనులను సిఐడి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని సందేహం అటు ప్రజలలో కూడా కనిపిస్తోంది. ఇందులో చంద్రబాబుకు ఒక న్యాయం జగన్కు ఒక న్యాయం చేస్తుంది సిఐడి.. జగన్ ఎక్కడికి వెళ్లాలన్నా కూడా కచ్చితంగా పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: