తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నారు. రోజుకో ఇష్యూ నడుస్తోంది. నేతల మధ్య మాటలయుద్ధాలు సాగుతున్నాయి. తాజాగా బీజేపీ నేతలపై బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసే ఉంటున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తెలంగాణలో షాడో మంత్రుల పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ నేత వివేకానంద మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణలో కలిసి పనిచేస్తూ కుట్రలకు పాల్పడుతున్నాయని విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత బండి సంజయ్ కోవర్టులా మారారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

బండి సంజయ్ కేంద్ర మంత్రి కానేకాదని, సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారని వివేకానంద చెప్పిన మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషనల్ అయ్యాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా చర్చలు సాగుతున్నాయి. బీజేపీ నేతలపై రేవంత్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని, గల్లీలో దోస్తీ చేస్తూనే ఢిల్లీలో కుస్తీ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఫ్రెండ్షిప్ వల్ల రాష్ట్రానికి ఎక్కువగా నష్టమే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి గుండు సున్నా వచ్చినా బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్షిప్ చేయడం చేస్తూ పాలననే మర్చిపోయారన్నారు.

బీఆర్ఎస్ మరో నేత రావుల శ్రీధర్ రెడ్డి కూడా బీజేపీ, కాంగ్రెస్ స్నేహంపై ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల మధ్య కొన్ని డీలింగ్స్ రహస్యంగా జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చాలా సార్లు ఇటువంటి కామెంట్సే చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్‌గా ఉంటున్నాయన్నారు. తమకు ఎవరి ఫ్రెండ్షిప్ అవసరం లేదని, ఒంటరిగానే కౌంటర్ ఎటాక్‌కు దిగుతామని కేటీఆర్ తేల్చి చెప్పారు. మొత్తంగా చూస్తే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ దోస్తీపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నా కాంగ్రెస్ నేతల నుంచి ఎటువంటి సమాధానం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: