
ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్రిసభ్య కమిషన్ ను ఏర్పాటు చేయగా ఇంజనీరింగ్ శాఖ అధికారులు, గుత్తేదారుపై త్రిసభ్య కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. హడావిడిగా పిల్లర్లు సైతం లేకుండా గోడ ఎందుకు కట్టారని త్రిసభ్య కమిషన్ కోరడంతో పాటు వాళ్లు చెప్పిన సమాధానాలను వీడియో రికార్డింగ్ చేయించారు.
అయితే ఈ ఘటనలకు సంబంధించి ఎన్నో అనుమానాలు తలెత్తుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. సింహాచలం ఘటనలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. సింహాచలం ఘటన విషయంలో ఏపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సింహాచలం ఘటన తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
సింహాచలం లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం భక్తులను ఎంతో బాధ పెట్టడంతో పాటు భక్తుల మనోభావాలను ఎంతో దెబ్బ తీసింది. ఈ తరహా ఘటనకు సంబంధించి వైసీపీ సైతం కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఈ మధ్య కాలంలో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు