
అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని వెల్లడించారు పవన్ కళ్యాణ్. లాటి దెబ్బలు ముళ్ళకంచెలు, విద్యార్థుల గాయాలు ఇబ్బంది పడ్డ ఇచ్చిన మాటకు కట్టుబడి అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు సైతం ప్రత్యేక ధన్యవాదాలు అంటు తెలియజేశారు. అమరావతి రైతుల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. గత ఐదేళ్లలో సుమారుగా 2000 పైగా రైతుల ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమరావతి జీవనాడి అంటూ తెలిపారు. అమరావతి రైతుల త్యాగాలను గుర్తుంచుకొని మరి మోదీ ఇక్కడికి వచ్చారని తెలిపారు.
ఇక గత ప్రభుత్వాన్ని అమరావతి అంటే పరదాలు, సెక్షన్లు సైతం గుర్తుకు వస్తాయని అయితే రైతులు ఈ ధర్మ యుద్ధంలో విజయాన్ని అందుకున్నారు అంటూ తెలిపారు. అమరావతి ప్రజల త్యాగాలు ఎప్పటికీ మరిచిపోలేమని మీ ఆశలకు అనుగుణంగానే అమరావతి నిర్మాణం ఉంటుందని వెల్లడించారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడిలో 27 మంది మరణించడం భారతదేశన్ని కలిసి వేసిందని ఇంత ఇబ్బందుల్లో కూడా ప్రధాన మోడీ ఇక్కడికి రావడం ఏపీ ప్రజల అదృష్టమని తెలియజేశారు. ప్రధాన మోడీకి భవాని అమ్మ ధైర్యం కూడా ఇవ్వాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ప్రస్తుతం అటు నరేంద్ర మోడీ అమరావతి రైతుల పైన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారుతున్నాయి.