టిడిపి పార్టీ నేతలు కార్యకర్తలు సైతం పండుగల జరుపుకునే మహానాడు ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు కడపలో జరపబోతున్నారు. అయితే ఈసారి మహానాడుకు చాలా ప్రత్యేకతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డగా ఉన్న కడపలో ఈసారి ఈ మహానాడును ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కూడా రాబోతున్నారట. ఎన్నికల ముందు నందమూరి కుటుంబంలో చీలికలు వచ్చాయనే విధంగా వార్తలు వినిపించాయి ..కానీ ఇప్పుడు నందమూరి కుటుంబంలో అయితే ఇప్పుడు ఐక్యత కనిపిస్తోందని విధంగా వినిపిస్తున్నాయి.


ఇటీవలే హరికృష్ణ మనవడు సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి వేడుకకు నందమూరి ఆడపడుచులందరూ కూడా ఒక్కటయ్యారు. అలాగే బాలకృష్ణ పద్మ అవార్డుకు కూడా అందరూ ఒకే వేదిక మీద చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. 2019లో టిడిపి పార్టీ చాలా ఘోరంగా ఓడిపోవడంతో ఐదేళ్ల పాటు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నది. మరొకవైపు నందమూరి కుటుంబంలో అటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారని ఎన్నోసార్లు వినిపించాయి. చాలామంది నేతలు కూడా ఈ నందమూరి హీరోల పైన వీరుచుకుపడడం కూడా జరిగింది.


అయితే ఇప్పుడు మహానాడు జరుగుతున్న వేళ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా ఈ మహానాడు కార్యక్రమానికి రాబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా మహానాడు సభకు ఆహ్వానించాలని అభిమానులలో కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని కూడా నింపేలా టిడిపి హై కమాండ్ భావిస్తున్నదట. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ వేడుకలకు రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. గడచిన కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో నానా హంగామా చేశారు. ఇటీవలే  కళ్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టిడిపి పార్టీ జెండాతో అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు. వీటిని బట్టి చూస్తే అటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లో మార్పు వచ్చిందని చాలామంది భావిస్తున్నారు. మొత్తానికి నందమూరి కుటుంబం మహానాడు సభకు ఒకసారిగా రాజకీయాలు హీటెక్కించేలా కనిపిస్తున్నాయి.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వస్తే మాత్రం ఫ్యాన్స్ ఖుషి అవుతారు.మరి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పైన వస్తున్న ఈ వార్తలలో ఎంత నిజం ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: