ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన నేపథ్యం లో.... ఇండియాకు ద్రోహం చేస్తున్న వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఈ తరుణంలోనే హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ను అరెస్టు చేశారు ఇండియన్ అధికారులు. పహల్గామ్ సంఘటన వెనుక కుట్రలు చేసింది జ్యోతి మల్హోత్రా అని తేల్చారు. ఇండియాకు సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్ ఆర్మీకి అందించి... ఇండియాకు ద్రోహం చేసినట్లు జ్యోతి మల్హోత్రాను తాజాగా అరెస్టు చేశారు.

 అయితే జనవరిలోనే పహల్గాం ప్రాంతంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పర్యటించినట్లు చెబుతున్నారు. అప్పుడే కాల్పులకు ప్లాన్ చేశారట. కానీ చివరి క్షణం లో... ఆ ప్లాన్ రద్దు చేసుకొని ఇటీవల కాల్పులు జరిపినట్లు విచారణలో తేలింది. పహాల్గం లో ఉన్న పరిస్థితులను మొత్తం... పాకిస్తాన్ లోని ఓ ప్రముఖ ఆర్మీ అధికారికి యూట్యూబర్  జ్యోతి అందించినట్లు తాజాగా తేలింది. అయితే ఆ ఆర్మీ అధికారితో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కు అక్రమ సంబంధం ఉందని కూడా తెలుస్తోంది.

అతని కారణంగానే ఇండియాకు సంబంధించిన లీకులన్నీ పాకిస్తాన్ కు చేరుతున్నట్లు గుర్తించారు అధికారులు. అంతేకాదు చాలా సార్లు పాకిస్తాన్లో పర్యటించి... అక్కడే కొన్ని రోజులు ఉందట. అలాగే చైనాకు కూడా వెళ్లి యూట్యూబర్  జ్యోతి మల్హోత్రా  కుట్రలు పండినట్లు చెబుతున్నారు.   ఇండియాకు సంబంధించిన లీకులను పాకిస్తాన్కు ఇచ్చినందుకు కోట్లల్లో డబ్బులు సంపాదించిందని కూడా... వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యూట్యూబర్  జ్యోతి మల్హోత్రా ని విచారణ చేస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు



మరింత సమాచారం తెలుసుకోండి: