
అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయని యునైటెడ్ బ్రోవరేస్ ప్రకటించింది. అమ్మకాలు కూడా భారీగా జోరు అందుకున్న నేపథ్యంలో డిమాండ్ కూడా అందుకు తగినంత రీతిలో సరఫరా చేయడానికి ఉత్పత్తిని మరింత పెంచుతున్నట్లు తెలియజేయడం జరిగింది కింగ్ ఫిషర్ బిర్ల కంపెనీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లకు పెరుగుతున్న డిమాండ్ ఎక్కువగా ఉండడం చేత ఉత్పత్తిని మరింత పెంచుతున్నామంటూ తెలియజేస్తున్నారట బిర్లా కంపెనీ. అందుకే హై కంపెనీలతో కూడా బాగామయ్యామంటూ తెలియజేస్తున్నారట. ఇందుకు సంబంధించి స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులకు కూడా తెలియజేసిందట కింగ్ ఫిషర్ కంపెనీ.
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యునైటెడ్ బ్రోవరేస్ తయారీ కేంద్రంగా నిర్వహిస్తున్నదని దీనికి ప్రాంతీయ ఇలియోస్ బ్రోవరేస్ ప్రైవేట్ లిమిటెడ్ లీజుకు తీసుకొని మరి ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేస్తున్నారట. ఇలా విస్తరించిన సామర్థ్యం ద్వార ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక వృద్ధితో పాటు పంపిణీ సామర్థ్యాన్ని కూడా మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. యునైటెడ్ బ్రోవరేస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ "జోర్ను కెర్బన్" మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరణకు చేయడానికి చాలా కుతూహలంగా ఉన్నామని వీటితో పాటు వినియోగదారులకు ఇష్టమైన బీరులను మరింత ఎక్కువగా అందించడానికి కృషి చేస్తున్నామంటూ తెలియజేశారు.